పైన ఫొటోలు చూడటానికి అమాయకంగా కనిపిస్తున్నా.. వీళ్ల పేర్లు సంగీత, రవళి. వీళ్లు చేసిన గలీజ్ పనికి ఇప్పుడు అంతా షాక్ అవుతున్నారు. కటుంబ పరువు, విలువలు అన్నీ గాలికొదిలేసి ఇలాంటి గలీజ్ దందాకు తెర లేపారు. అయితే వీరి చేస్తున్న ఈ దందా ఎట్టకేలకు పోలీసుల చెవిన పడింది. దీంతో చాకచక్యంగా ముందుకు వెళ్లిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీళ్ల పాడు పనికి పోలీసులు సైతం నోరెళ్లబెట్టారు. అసలు ఈ మహిళలు ఎవరు? వీరు చేసిన ఆ గలీజ్ పని ఏంటనే పూర్తి వివరాలు తెలుసుకోవాలనుందా? అయితే తప్పకుండా ఈ స్టోరీ చదవాల్సిందే.
కర్ణాటకకు చెందిన సాయినాథ్ చౌహన్, రవళి భార్యాభర్తలు. వీరికి గతంలో పెళ్లి జరిగింది. అయితే ఈ దంపతులు తెలివిగా, అతి తక్కువ సమయంలో డబ్బు ఎలా సంపాదించాలనే మార్గాలను వెతికారు. ఇక కొన్నాళ్ల తర్వాత ఈ దంపతులు ఓ గలీజ్ దందాకు శ్రీకారం చుట్టారు. అదే గంజాయి అక్రమ రవాణా. కర్ణాటకకు చెందిన ప్రధాన డ్రగ్ పెడ్లర్ ఆకాశ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ దంపతులు గంజాయి కొనుగోలుకు సిద్దమయ్యారు. రవళి స్నేహితురాలైన సంగీతతో పాటు బానావత్ కిషన్, బానావత్ నాగలు, వినాయక్, షేక్ నవజుద్దీన్ వంటి ముఠా సభ్యులు ఏకమై ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లారు.
ఏజెన్సీ ప్రాంతాల వారైన సంసాయిరావు, రాజు నుంచి ఈ ముఠా సభ్యులు సుమారుగా 480 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. ఇక కొనుగోలు చేసిన ఆ గంజాయిని ఈ ముఠాసభ్యులు హైదరాబాద్ నుంచి నేరుగా కర్ణాటకకు తరలించేందుకు ప్లాన్ వేసుకున్నారు. ఇక విశ్వసనీయ సమాచారం మేరకు వీరి గలీజ్ దందా హయత్ నగర్ పోలీసుల చెవిన పడింది. వెంటనే పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం ఈ ముఠాసభ్యులుగా ఉన్న రవళి, సంగీతలపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకి తరలించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ గంజాయి దందా స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.