ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. బరితెగించి ప్రవర్తిస్తున్న తండ్రి ఆగడాలను చూసి కూతురు భరించలేకపోయింది. తండ్రి అరాచకాన్ని తట్టుకోలేని కూతురు కోపంతో తండ్రిని రాయితో కొట్టి చంపింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు కన్న కూతురు తండ్రిని హత్య చేయడానికి కారణం ఏంటి? అంతలా దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ ప్రాంతంలో ఓ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి 17 ఏళ్ల కూతురు కూడా ఉంది. అయితే గత కొంత కాలం నుంచి భర్త పరాయి మహిళల మోజులో పడి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక ఇంతటి ఆగకుండా సంసారాన్ని గాలికి వదిలేసి.. భార్యాని, కూతురిని తరుచు వేధింపులకు గురి చేస్తున్నాడు. వీటన్నిటిని చూస్తున్న కూతురు తట్టుకోలేకపోయింది. తండ్రి ఆగడాలకు కూతురు ఫుల్ స్టాప్ పెట్టాలని తండ్రికి ఎన్నోసార్లు చెప్పి చూసింది. అయినా కూతురు మాటని లెక్కచేయని తండ్రి.. అదే పనిగా విర్రవీగి ప్రవర్తించాడు.
ఇలా అయితే కాదని భావించిన కూతురు తండ్రిని రాయితో కొట్టి చంపింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను జువైనల్ హెమ్ కు తరలించగా, తల్లిని జైలుకు తరలించారు. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. తండ్రి వివాహేతర సంబంధాన్ని తట్టుకోలేకపోయిన కూతురు తండ్రిని హత్య చేయడం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.