నేటి కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా దారుణాలు వెలుగు చూస్తున్నాయి. అక్రమ సంబంధాల కారణంగానే ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త. ఇలా ఒకరు కాకుండా ఒకరు వివాహేతర సంబంధాల్లో వేలు పెడుతూ పచ్చని సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇదే అనుమానంతో ఓ భర్త భార్యను దారుణంగా హత్య చేశాడు. తాజాగా చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్నఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాలోని భాకరాపేట. ఇదే ప్రాంతానికి చెందిన శ్రీకాంత్, రెడ్డమ్మ అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. కులాలు వేరైన 6 ఏళ్ల కిందట పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. ఇక ఏడాది తిరిగేసరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. అలా వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగుతున్న క్రమంలోనే భార్యాభర్తల మధ్య ఏదో గొడవ జరిగింది. దీంతో అప్పటి నుంచి వీరిద్దరూ కాస్త దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే రెడ్డమ్మ పరాయి మగాడి మోజులో ఉందని, అతనితోనే వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుందనే అనుమానం భర్తకు బలంగా కలిగింది. ఇదే విషయమై భార్యాభర్తలు మధ్య తరుచు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వినాయక చవితి సందర్భంగా భార్య ఇంటికి వచ్చింది. భార్యాభర్తలు మళ్లీ ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే భార్య ప్రియుడు అప్పుడప్పుడు గ్రామానికి వస్తున్నాడని భర్త శ్రీకాంత్ చెవిన పడింది. దీంతో అతని కోపం మరింత పెరిగింది. ఇదే విషయమై దంపతుల మధ్య మరోసారి గొడవ రాజుకుంది. కోపంతో ఊగిపోయిన శ్రీకాంత్ ఇంట్లో ఉన్న కత్తితో భార్యను దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ఇక వారి ఇంట్లోకి వీధి కుక్కలు వెళ్లి వస్తుండడంతో స్థానికులకు అనుమానం కలిగింది. ఏం జరిగిందని వారి ఇంట్లోకి వెళ్లగా రెడ్డమ్మ రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం రెడ్డమ్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త శ్రీకాంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: పరాయి స్త్రీల మోజులో భర్త! తట్టుకోలేక వేడి నూనె పోసిన భార్య..