ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. యమున నది ఎక్స్ ప్రెస్ వే రోడ్డు పక్కన ఎరుపు రంగు సూటు కేసులో ఓ యువతి శవం కనిపించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా భయందోళనలకు గురయ్యారు. ఈ విషయం వెంటనే పోలీసుల వరకు వెళ్లింది. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ క్రైమ్ స్టోరీలో మిస్టరీ ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నితీష్ కుమార్ అనే వ్యక్తి సౌత్ ఢిల్లీలోని బదార్ పూర్ లో నివాసం ఉంటున్నాడు. ఇతనికి చాలా ఏళ్ల కిందటే పెళ్లై పెళ్లీడుకొచ్చిన ఆయూషి (22) అనే కూతురు కూడా ఉంది. అయితే గత కొన్నేళ్ల నుంచి నితీష్ కుమార్ తన భార్య, కూతురితో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే కూతురు ఆయూషి ఓ యువకుడితో ప్రేమాయణాన్ని కొనసాగించింది. అలా వీరి ప్రేమాయణం నెలల నుంచి ఏళ్లు గడుస్తూ వచ్చింది. ఇక ఆయూషి ఎలాగైన తన ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అనుకున్నట్లుగానే కొన్నాళ్ల తర్వాత ఆయూషి తన తల్లిదండ్రులకు తెలియకుండా ప్రియుడిని పెళ్లి చేసుకుని రాత్రి పూట ఇంటికి ఆలస్యంగా వస్తుండేది.
దీంతో తండ్రి నితీష్ కుమార్ కు కూతురు ప్రవర్తనపై ఎందుకో అనుమానం వచ్చింది. ఏంటని కూతరుని తండ్రి ప్రశ్నించగా.. నేను వేరే కులం యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న నితీష్ కుమార్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. కూతురి చెప్పిన నిజాన్ని జీర్ణించుకోలేక కోపంతో ఊగిపోయిన నితీష్ కమార్.. తుపాకీతో కూతురిని దారుణంగా కాల్చి చంపాడు. తండ్రి దాడిలో కూతురు ఆయూషి రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం కూతురు మృతదేహాన్ని కవర్ లో చుట్టి సూట్ కేసులో పెట్టాడు.
ఇక అదే సూట్ కేసుతో నితీష్ కుమార్ ఉత్తర్ ప్రదేశ్ చేరుకుని యమునా ఎక్స్ ప్రెస్ వే పక్కన పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక మరుసటి రోజు రోడ్డు పక్కన సూట్ కేసులో ఓ యువతి కనిపించడంతో స్థానికులు అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఇక ఎట్టకేలకు యువతి పేరు ఆయూషి, ఢిల్లీ ప్రాంతమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనలో అనుమానితులను విచారిస్తున్న క్రమంలో ఆయూషి తల్లిదండ్రులపై పోలీసులకు అనుమానం వచ్చింది. గట్టిగా విచారించే సరికి.. మా కూతురు వేరే కులం అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందని, దీని కారణంగా మా కూతురుని మేమే హత్య చేశామంటూ తల్లిదండ్రులు అసలు నిజాన్ని బయట పెట్టేశారు. అనంతరం ఆయూషి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.