ఈ మధ్య కాలంలో కొందరు భర్తలు మృగాలుగా మారిపోతున్నారు. పెళ్లికి ముందు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని మాటిస్తారు. ఇక పెళ్లై ఏడాది తిరగకముందే భర్తలు తమ అసలు రూపాలను బయటపెడుతున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ కసాయి భర్త భార్య తల, మొండం వేరు చేసి దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ క్రైమ్ స్టోరీలో అసలు ఏం జరిగింది? కట్టుకున్న భార్యపై భర్త ఇంత దారుణానికి ఒడిగట్టడానికి కారణం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాడోల్ ప్రాంతం. ఇక్కడే రామ్ కిషోర్ పటేల్, సరస్వతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల అన్యోన్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. కానీ రోజులు మారే కొద్ది భర్త రామ్ కిషోర్ పటేల్ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇదే అనుమానంతో రామ్ కిషోర్ పటేల్ భార్యను వేధిస్తూ ఉండేవాడు. దీని కారణంగా భార్యభర్తల మధ్య తరుచు గొడవలు కూడా జరుగుతుండేవి. ఇక భార్యభర్తల మధ్య గొడవలు రాను రాను కొట్టుకునే స్థాయికి చేరుకున్నాయి. అయితే ఈ క్రమంలోనే గత వారం రోజుల కిందట రామ్ కిషోర్ పటేల్ భార్య సరస్వతితో గొడవ పడ్డాడు.
కోపంతో ఊగిపోయిన భర్త రామ్ కిషోర్ పటేల్ ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. భర్త దాడిలో భార్య రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచింది. ఇక ఇంతటితో ఆగకుండా భార్య తలను మొండం నుంచి వేరు చేసి స్థానికంగా ఉండే ఓ అడవిలో వేరు వేరు ప్రదేశాల్లో భార్య శవాన్ని పూడ్చిపెట్టాడు. అలా రెండు రోజులు గడిచింది. ఇంట్లో కోడలు సరస్వతి కనిపించకపోవడంతో అత్తకు అనుమానం వచ్చింది. బంధువుల ఇళ్లల్లో అడిగి తెలుసుకుంది. కానీ కోడలు జాడ మాత్రం దొరకలేదు. ఏం చేయాలో అర్థం కానీ సరస్వతి అత్త.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. భర్త రామ్ కిషోర్ పటేల్ భార్య సరస్వతిని చంపి మోహ్రలి అడవిలో పూడ్చిపెట్టినట్లుగా తేల్చారు. అనంతరం పరారీలో ఉన్న భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. అనుమానంతో నా భార్యను నేనే హత్య చేశానంటూ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత పోలీసులు రామ్ కిషోర్ పటేల్ అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
ఇది కూడా చదవండి: శ్రద్ధ కేసు మరవక ముందే మరో దారుణం.. మాజీ ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి!