ఈ మధ్య కాలంలో కొందరు ఉపాధ్యాయులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా ప్రతీ చిన్న విషయానికి క్షణికావేశంలో ఊగిపోయి చిన్న పిల్లలు అని చూడకుండా భౌతిక దాడులకు దిగుతున్నారు. ఇటీవల రాజస్థాన్ లో ఓ దళిత బాలుడు కుండలో నీళ్లు తాగాడని ఓ టీచర్ దారుణంగా చావగొట్టిన విషయం తెలిసిందే. ఇక ఇది మరువక ముందే మరో వార్త సంచలనంగా మారుతోంది.
ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ బాలుడి తండ్రి స్కూలు ఫీజు కట్టలేదని మాస్టారు విద్యార్థిని దారుణంగా కొట్టి చంపాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జలోర్ జిల్లా సిరిసియా మండలం సురన. ఇదే గ్రామంలో 13 ఏళ్ల బాలుడు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్నాడు. అయితే రూ.250 స్కూలు ఫీజు కట్టాలని స్కూలు టీచర్ ఆ బాలుడిని తరుచు వేధింపులకు గురి చేస్తుండేవాడు.
ఇందులో భాగంగానే గత వారం కూడా మరోసారి ఆ టీచర్ ఆ బాలుడితో స్కూల్ ఫీజు కట్టాలంటూ అతనిపై దారుణంగా దాడికి దిగాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ బాలుడు చికిత్స పొందుతు ఇటీవల మరణించాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. స్కూల్ ఫీజు కట్టలేదని బాలుడిని దారుణంగా కొట్టి చంపిన టీచర్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.