నేటికాలంలో యువతి, యువకుల్లో అసహనం పెరిగిపోతుంది. ప్రతీది తమకు క్షణాల్లో జరిగిపోవాలనే ధోరణిలో ఉంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే కొందరు యువతులు శృతి మించి ప్రవర్తిస్తున్నారు. తాము అనుకున్నది జరగకున్న, ఎవరైన ప్రశ్నించిన దాడులకు తెగ బడుతున్నారు. మరికొందరు యువతులు ప్రభుత్వ అధికారులతో సైతం ఘర్షణకు దిగి, దాడులు చేస్తున్నారు. చివరికి కటకటాల పాలవుతున్నారు. తాజాగా ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. అక్కడ వీరంగ సృష్టించారు. ఏకంగా మహిళా ఎస్ఐపై చెప్పులతో దాడికి దిగారు. ఆదివారం బీహార్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే..
బీహార్ రాష్ట్రం పట్నాలోని రామకృష్ణనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీర్ ప్రాంతంలో రోడ్డుపై ఇద్దరు అక్కాచెల్లెళ్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో అటుగా బైక్ మీద వచ్చిన ఆగంతకులు యువతి వద్ద మొబైల్ లాక్కొని పారిపోయారు. దీంతో ఫిర్యాదు చేసేందుకు రామకృష్ణ నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లిన ఆ ఇద్దరు యువతులను దాదాపు మూడు గంటల పాటు వేచి ఉంచారు పోలీసులు. దీంతో ఈ యువతులిద్దరికీ కోపం వచ్చి.. పోలీస్ స్టేషన్ లో వీరంగ సృష్టించారు.
పెద్ద ఎత్తున అరుస్తు రచ్చ రచ్చ చేశారు. అంతటితో ఆగక ఏకంగా అక్కడి మహిళా ఎస్ఐపై దాడికి పాల్పడ్డారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. పాపం.. కేసు పెడదామని వచ్చిన ఆ యువతులపైనే కేసు నమోదైంది. కాబట్టి ఎక్కడ బడితే అక్కడ ఆవేశాన్ని ప్రదర్శించకుడదని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.