ఈ మద్య దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది గాయపడుతున్నారు.. చనిపోతున్నారు. ఇంటి పెద్దను కోల్పోయిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. డ్రైవర్ల నిరక్ష్యం ఇందుకు కారణం అంటున్నారు అధికారులు.
ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. జరిమానాలు విధిస్తున్నా వీరిలో మార్పు రావడం లేదని అంటున్నారు. డ్రైవర్లు చేసే ఒక్క తప్పు వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. గంట్యాడ లో దారుణం చోటు చేసుకుంది.. లారీ రూపంలో భార్యాభర్తలను ప్రమాదం వెంటాడింది. వివరాల్లోకి వెళితే..
విజయనగరం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ బంధువులను పరామర్శించి తమ స్వగ్రామానికి తిరిగి వస్తున్న దంపతులను లారీ రూపంలో ప్రమాదం వెంటాడింది.. ఈ ఘటనలో భార్య అక్కడిక్కడే చనిపోగా భర్త పరిస్థితి విషమంగా ఉంది. బొండపల్లి కి చెందిన రేగిటి రాము, సూరమ్మ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. తమ బంధువులకు ఆరోగ్యం బాగాలేదన్న విషయం తెలుసుకొని పరామర్శించేందుకు ద్విచక్రవాహనంపై విజయనగరం వచ్చారు. తిరిగి తమ గ్రామానికి బయలుదేరారు.. కొర్లాం చెరుకు కాటా వద్ద లారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సూరమ్మ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడే చనిపోయింది.
లారీ రాము కాళ్లపై నుంచి వెళ్లడంతో కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి.. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని రామును 108 వాహనంలో చికిత్స కోసం ఆస్పత్రికి పంపించారు. సూరమ్మ మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. ఒక కొడుకు ఉన్నారు. ఎలాంటి ఆధారం లేకపోవడంతో కుటుంబం రోడ్డుపై పడిందని ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.