ఈరోజుల్లో అక్రమ సంబంధాలు ఎక్కడ చూసినా కూడా కామన్ అయిపోయాయి. ఊరిలో అయితే తెలిసిన వారి చీకటి బంధాల గురించి చర్చోపచర్చలు చేస్తుంటారు కూడా. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడటం లేదు అనుకుంటుంది. వీళ్లు కూడా పరాయి వ్యక్తి పక్కలో ఓలలాడుతూ తమను ఎవరూ చూడటం లేదు అనుకుంటూ కాలం గడుపుతున్నారు. అలా ఓ భార్య కూడా అనుకుని భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. అలా పట్టుకున్న పాపానికి భర్తనే కడ తేర్చింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లో రాజేశ్- జయ(పేర్లు మార్చాం) దంపతులు జీవిస్తున్నారు. రాజేశ్ వడ్రంగిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్యాభర్తలు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఎప్పుడూ వారి మధ్య ఎలాంటి గొడవ కూడా కాలేదు. కొన్ని రోజుల తర్వాత రాజేశ్ కు జయపై అనుమానం మొదలైంది. ఎందుకో ఆమె తనను మోసం చేస్తోంది అని భావించాడు. అయితే మొదట కేవలం అనుమానమే అనుకున్నాడు. కానీ, అది నిజం అనుకోవడానికి కొన్ని ఆధారాలు కూడా దొరికాయి.
ఆమె ప్రవర్తనలో కాస్త మార్పు వచ్చింది. రాజేశ్ భావించింది నిజమే అని తేలడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. జయకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. రోజూ భర్త పనికి వెళ్లిపోగానే ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంటుంది. ప్రియుడితో పడక సుఖాలు తీర్చుకునేందుకు బాగా అలవాటు పడిపోయింది. భర్తకు ఏమాత్రం అనుమానం రాకుండా ఎంతో జాగ్రత్త పడింది కానీ, ఓ రోజు దొరికిపోయింది. భార్య అనుమానంతోనే పనికి వెళ్లినట్లు వెళ్లి రాజేశ్ ఇంటికి తిరిగివచ్చాడు. ఆ సమయంలో భార్య ఆమె ప్రియుడి పక్కలో కామవాంఛలు తీర్చుకుంటూ ఉంది. ఆ దృశ్యాన్ని రాజేశ్ చూశాడు.
ఇదీ చదవండి: లాడ్జిలో లింగమార్పిడి ఆపరేషన్.. మర్మాంగాన్ని తొలగించి!
ప్రియుడితో ఉన్న భార్యను రాజేశ్ రెడ్ హ్యాడెడ్ గా పట్టుకున్నాడు. ఆ సమయంలో ఏం చేయాలో జయకు అర్థం కాలేదు. కాళ్లు చేతులూ ఆడలేదు. వెంటనే తేరుకుని ఓ నిర్ణయం తీసుకుంది. భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. ఆ తర్వాత ఎవరూ చూడకుండా శవాన్ని అడవిలో పారేశారు. తన భర్తను ఎవరో చంపేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త ఫోన్ నుంచి తనకు కాల్ చేసి చెప్పినట్లు చెప్పుకొచ్చింది. మొదటి నుంచి పోలీసులకు ఆమె ప్రవర్తనపై అనుమానం ఉంది. తన ప్రియుడి గురించి తెలియగానే అసలు కథ బయటకు వచ్చింది. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సుఖానికి పోయి కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.