పాఠశాల వయసు నుంచే మేము ప్రేమలో పడ్డాం అంటూ పిల్లలు కొందరు చెబుతుంటారు. వాళ్ల వయసుకు అసలు ప్రేమ అనే పదానికి అర్థం కూడా తెలుసో లేదో? ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ ఇష్టారీతిన తిరగడం. పెద్దలు మందలించగానే క్షణికావేశంలో ఏదొక తప్పుడు నిర్ణయం తీసుకోవడం పరిపాటిగా మారిపోయింది. 15 ఏళ్ల వయసుకే తాను ప్రేమలో మోసపోయానంటూ ఓ పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని మధురవాయిల్ కు చెందిన ఓ 15 ఏళ్ల విద్యార్థిని కోయంబేడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. శనివారం రాత్రి ఆ విద్యార్థినికి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారంతో మధురవాయిల్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. ఆ తర్వాత ఆమె నోట్ బుక్స్ చూడగా కొన్ని విషయాలు వెలుగు చూశాయి.
ఆమె ఓ అబ్బాయిని ప్రేమిస్తున్న విషయం నోట్ బుక్ రాసుకుంది. కానీ, అతను మాత్రం వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని.. ఆ అబ్బాయి మోసం చేశాడనే మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు విద్యార్థిని రాసుకొచ్చింది. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ అబ్బాయి కోసం వెళ్లారు. కానీ, అతను ఇంట్లో లేడు.. అతను పరారీలో ఉన్నాడు. అతనిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఆ యువతి ప్రపోజ్ చేస్తే అతను కాదని వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడా? లేక ఆ విద్యార్థినిని ప్రేమ పేరుతో మోసం చేసి వేరే అమ్మాయితో ప్రేమాయణం నడిపిస్తున్నాడా? అనే విషయాలు అతను దొరికేతే గానీ బయటకు రావు. ప్రేమ విఫలం అనే కారణంతో ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ముగ్గురు పిల్లలతో కాల్వలో దూకిన మహిళ