హైదరాబాద్ లోని ఓ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో డిపో లోపల 11 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో మొత్తం 12 మంది కార్మికులు ఉన్నారు. వీరంతా గత రాత్రి అందులోనే నిద్రపోయారు. బుధవారం తెల్లవారు జామున షార్ట్‌సర్క్యూట్ కారణంగా డిపోలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో నిద్రిస్తున్న 12 మందిలో 11 మంది మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. జనావాసాల మధ్య ఈ టింబర్ డిపో ఉంది. చుట్టుపక్కల ఇళ్లవాళ్లను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. మంటలు చుట్టుపక్కలకు వ్యాపించడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాలను వెలికి తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులను బీహార్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు.
బీహార్ నుంచి వచ్చిన కార్మికులు ఈ ప్లాస్టిక్ గోడౌన్ లో పనిచేస్తున్నారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రేకుల కప్పు గల గోడౌన్ మొత్తం దగ్ధమైంది. నిద్రలోనే కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను రాజేష్, బిట్టు, సికిందర్, దామోదర్, సత్యేందర్, దినేష్, రాజు, దీపక్, పంకజ్, చింటులుగా గుర్తించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.