హైదరాబాద్ లోని ఓ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో డిపో లోపల 11 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో మొత్తం 12 మంది కార్మికులు ఉన్నారు. వీరంతా గత రాత్రి అందులోనే నిద్రపోయారు. బుధవారం తెల్లవారు జామున షార్ట్‌సర్క్యూట్ కారణంగా డిపోలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో నిద్రిస్తున్న 12 మందిలో 11 మంది మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. […]