ఇటీవల చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురైతున్నారు. కొంతమంది డ్రిపేషన్ లోకి వెళ్లి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరికొంత మంది ఆ సమయంలో క్షణికావేశానికి లోనై ఎదుటివారిపై దాడులు చేయడం.. తమ జీవితాలను బలి చేసుకోవడం లాంటివి చేస్తున్నారు.
ఈ మద్య కొంతమంది చిన్న విషయాకే తీవ్ర మనస్థాపానికి గురై ఎన్నో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పని ఒత్తిడి, ఆర్థిక కష్టాలు.. వివాహేతర సంబంధాలు.. కారణాలు ఏవైనా మానసికంగా కృంగిపోయి క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎన్నో కుటుంబాలు విషాదాల్లో మునిగిపోతున్నాయి. తాజాగా భార్యాభర్తలు తమ మూడేళ్ల చిన్నారికి ఉరివేసి తాము ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో మంగళవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. దేవరపల్లి గ్రామంలో ఓ మూడేళ్ల చిన్నారికి ఉరివేసి.. ఆ తర్వాత భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరపల్లికి చెంది అశోక్ ఏడాదిన్నర క్రితం అంకిత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు మూడు నెలల క్రితం పాప జన్మించింది. ఈ మద్యనే అశోక్ సోదరికి వివాహం సంబంధం కుదిరింది. నిశ్చితార్థం ఏర్పాట్లు చూసుకునేందుకు పాపతో అంకిత గురువారం దేవరపల్లికి చేరుకుంది. సోమవారం రాత్రి అశోక్ ఆయన తమ్ముడు రాఘవేంద్ర ఆటోలో కూరగాయల మార్కెట్ కి వెళ్లి సామాన్లు కొనుక్కొని తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి వచ్చారు.
తమతోపాటు తెచ్చుకున్న బిర్యాని తీన్న తర్వాత తమ్ముడు రాఘవేంద్ర అక్కడ నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత అశోక్ టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టి మొదట మూడు నెలల చిన్నారిని ఉరివేసి చంపాడు.. ఆ తర్మాత దంపతులిద్దరూ ఫ్యాన్ కి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎంతకీ టీవీ సౌండ్ తగ్గించకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి అశోక్ ఇంటి తలుపు తట్టారు.. తీయకపోవడంతో తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా చిన్నారి, అంకిత అప్పటికే చనిపోయి ఉన్నారు. అశోక్ ని దించి ఆస్పత్రికి తరలించేలోపు చనిపోయాడు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చిన్నారి సహా దంపతులు ఎందుకు ఉరి వేసుకున్న విషయంపై కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.