సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటుంటారు.. తమ అభిమాన హీరో కోసం దేనికైనా సిద్దపడుతుంటారు. వారికి సంబంధించిన ఏ చిన్న సెలబ్రేషన్స్ ఉన్నా ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా సినిమా రిలీజ్, పుట్టిన రోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు.
ఇండస్ట్రీలో హీరోలకు హార్డ్ కోర్ అభిమానులు ఉంటారు. తమ హీరో సినిమా రిలీజ్ రిలీజ్ అయ్యిందంటే.. భారీ కటౌట్లు, పాలాభిషేకం చేయడం.. డ్యాన్సులు వేస్తూ సంబరాలు చేస్తుంటారు. ఇక పుట్టిన రోజు కార్యక్రమాలకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేకులు కట్ చేసి తెగ సందడి చేస్తుంటారు. తమ అభిమాన హీరోల కోసం వేరే హీరోల అభిమానులతో గొడవలు పడటం..కొట్టుకోవడం లాంటివి కూడా జరుగుతుంటాయి. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్, పుట్టిన రోజు సందర్భంగా భారీ ఎత్తున ఫ్లెక్సీల ఏర్పాటు చేసే సమయంలో కరెంట్ షాక్ తో చనిపోయిన సంఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
తమిళ హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. సూర్యకు కోలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లో కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. సూర్య నటించిన ప్రతి సినిమా తెలుగు లో రిలీజ్ అవుతుంటాయి.. ఇక్కడ కూడా మంచి సక్సెస్ సాధిస్తుంటాయి. పల్నాడు జిల్లా నరసరావు పేటలో తీవ్ర విషాదం నెలకొంది. హీరో సూర్య పుట్టిన రోజు సందర్బంగా ఆయన ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ తగలడంతో ఒక్కసారే కిందపడి గిల గిలా కొట్టుకున్నారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించేలోపు కన్నుమూశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు అర్ధాంతరంగా మరణించడంతో గ్రామంలో ఒక్కసారే తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హీరో సూర్య ప్రకారం హీరో సూర్య పుట్టిన రోజు సందర్భంగా మోపువారి పాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్, బాపట్ల జిల్లా కు చెందిన పోలూరి సాయి తమ స్నేహితులతో కలిసి శనివారం రాత్రి నరసరావు పేటలో ఫ్లెక్సీలు కడుతున్నారు. ఫ్లెక్సీలకు ఉన్న ఇనుప ఫ్రేమ్ పైన ఉన్న విద్యుత్ తీగలకు తగలడంతో ఇద్దరు స్నేహితులకు విద్యుత్ షాక్ తగిలడంతో కిందపడి గిల గిలా కొట్టుకున్నారు. వారిని ఆస్పత్రికి తరలించేలోగా చనిపోయారు. మృతదేహాలను నరసనరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చనిపోయిన విద్యార్థులు స్థానికంగా ఓ ప్రైవేట్ కాలేజ్ లో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.