ఈ మద్య ఎంతోమంది చిన్న విషయాలకే మనసు వికలం చేసుకుంటున్నారు.. క్షణికావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలకు పాల్పపడుతూ కన్నవారికి శోకాన్ని మిగుల్చుతున్నారు.
ఇటీవల కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి మనస్థాపం చెందడం.. డిప్రేషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు, ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాలు, పని ఒత్తిడి ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రతిరోజూ ఎక్కడో అక్కడ బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు. ఇటీవల ప్రముఖ కొరియోగ్రాఫర్ గా రాణిస్తోన్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య బలవన్మరణానికి పాల్పపడ్డ విషయం తెలిసిందే. తాజాగా మరో డ్యాన్స్ మాస్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే..
కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమరబండలో శుక్రవారం దార సురేష్ (30) అనే డ్యాన్స్ మాస్టర్ ఉరివేసుకొని బలవన్మరణానికి పాలప్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమరబండ గ్రామానికి చెందిన దార సురేష్ కొంతకాలంగా డ్యాన్స్ మాస్టర్ గా కొనసాగుతున్నాడు. ఎంతోమంది విద్యార్థులకు ఆయన డ్యాన్స్ చేర్పిస్తూ అందరితో కలివిడిగా ఉండేవాడు. ఇటీవల కాలంలో సురేష్ మద్యానికి బానిసయ్యాడు. తనకు వివాహం కాకపోవడంతో మనస్థాపానికి గురపై మద్యానికి బానిసైనట్లు సన్నిహితులు అంటున్నారు. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెంది సురేష్ ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పపడ్డాడు.
సురేష్ స్నేహితుడు ఇంటికి వెళ్లి తలుపులు కొట్టగా ఎంతకీ తీయకపోవడంతో అనుమానంతో కిటికీలో నుంచి చూడగా ఉరివేసుని ఉన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే సురేష్ ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతిడి అన్న బొబ్బిలి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.