నేటికాలంలో యువత సమస్యలను ధైర్యంగా ఎదుర్కో లేకపోతున్నారు. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు భయపడి, తాము ఏమీ సాధించలేక పోతున్నామని, తల్లిదండ్రులకు భారమవుతున్నామని భావించి.. జీవితాన్ని అర్థాంతరంగా ముగిస్తున్నారు. అచ్చం అలాగే తల్లిదండ్రులకు తన చదువు భారమౌతుందని భావించి.. ఓ బీటెక్ విద్యార్థిని రైలులో నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
గద్వాలలోని నల్లకుంట కాలనీకి చెందిన బీటెక్ విద్యార్థిని గొబ్బూరి శ్రీవర్ష(19) హైదరాబాద్ లోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. శ్రీవర్ష తండ్రి ఓ ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వారి కుటుంబానికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అయినా శ్రీవర్షను కష్టపడి చదవిస్తున్నారు. ఆమెకు చదువు భారంగా భావించింది. ఎంత కష్టపడి చదివినా ఫలితం లేదని భావిస్తుండేది. ఈ క్రమంలో తన తండ్రి ఎంతో కష్టపడి ఫీజులు చెల్లిస్తుండటంతో అవి వ్యర్థమవుతున్నాయని బాధపడుతుండేది. దీనికి తోడు శ్రీవర్షకు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఈ రెండు విషయాల్లో కొంతకాలం నిత్యం మానసిక వేదన అనుభవిచింది.
బుధవారం ఇంటి నుంచి కళాశాలకు వెళ్తున్నానని చెప్పి రైలు ఎక్కింది. సాయంత్రం రైలు గద్వాల సమీపంలోని కృష్ణానది దగ్గరికి రాగానే నదిలోకి దూకింది. ఆ సమయంలో నీటి ప్రవాహం లేనిచోట రాళ్లపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య సమస్యల కారణంగా మానసిక ఒత్తిడికి గురై తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కోంది. శ్రీ వర్ష మరణ వార్త తెలుకున్న స్నేహితులు కడసారి వీడ్కొలు పలికేందుకు ఆసుపత్రికి చేరుకుని కన్నీరు మున్నీరుగా రోధించారు. తన సమస్యలు ఎప్పుడు తమతో పంచుకోలేదని.. చెప్పి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.