తల్లిదండ్రులు కూడా పిల్లలను మార్కుల కోసం, ర్యాంకుల కోసం ఒత్తిడి చేస్తున్నారు. అలాంటిది మహారాష్ట్రలో ఓ ఆటోడ్రైవర్ కుటుంబంలోని తల్లిదండ్రులు తమ కొడుకు 35 శాతం మార్కులు వచ్చినా కూడా సంబరాలు చేసుకున్నారు.
చాలామంది విద్యార్థులను తల్లిదండ్రులు కష్టపడి పీజులు కట్టి చదివిస్తున్నారు. పిల్లలు పరీక్ష పాస్ కాకపోతే పేరెంట్స్ చాలా బాధపడి పిల్లలను ఎక్కువ మార్కులు వచ్చేలా చదవాలని తిడతారు. తమ పిల్లలు ర్యాంకు తెచ్చుకోవాలని ట్యూషన్స్ కూడా పెట్టిస్తారు. ఎంత ఒత్తిడి అయినా సరే మార్కులే ముఖ్యం అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ఈ క్రమంలో పిల్లలు మానసికంగా చాలా నలిగిపోతారు. మిగతా విషయాలపై కాన్సంట్రేషన్ చేయలేకపోతారు. అందకుగాను పిల్లలను సానుకూలంగా కొంతమంది తల్లిదండ్రులు ఎక్కువ మార్కులు తెచ్చుకునేలా ప్రోత్సహిస్తారు.
అందరికీ చదువు అబ్బదు. కొందరికి తక్కువ మార్కులు వచ్చినా అన్ని సబ్జెక్టుల్లో పాస్ అవుతారు. కొందరు కొన్ని సబ్జెక్టుల్లో మార్కుల ఎక్కువ వచ్చినా కూడా ఒక్కో సబ్జెక్ట్ ఫెయిల్ అవుతారు. అంటే నూటికి 35 మార్కులు వచ్చినా పాస్ కాబట్టి 35 మార్కులు పొందిన వారిని కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. సరిగ్గా అలాంటిదే మహారాష్ట్రలో ఓ విద్యార్థి పేరెంట్స్ చేశారు. తమ కొడుకుకు పదో తరగతి ఫలితాల్లో 35 శాతం మార్కులతో పాస్ అయినా సరే సంబరాలు జరుపుకుని సందడి చేశారు. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలో ఓ సామాన్య కుటుంబంలోని తల్లిదండ్రులు.. తమ కొడుకు పదవ తరగతిలో 35 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. ఠాణెకు చెందిన విద్యార్థి తండ్రి ఆటోడ్రైవర్. తమ కొడుకు పదవతరగతి పాస్ అయినందుకు వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. సంబరాలు జరుపుకున్నారు. ఈ వీడియో నట్టింట వైరల్ గా మారింది. ఐఏఎస్ ఆఫీసర్ అవనీశ్ శరణ్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తనకు 10వ తరగతిలో 44.7 శాతం మార్కులు సాధించానని, డిగ్రీ తర్వాత సివిల్స్ రెండో ప్రయత్నంలో 77వ ర్యాంకు పొందానని తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. ఇలాంటి పేరెంట్స్ ఉంటే విద్యార్థుల బలవన్మరణాలు తగ్గిపోతాయి. విద్యార్థులు కూడా ఒత్తిడి లేని చదువుకు అలవాటుపడతారని నెటిజన్లు అంటున్నారు. సానుకూలత కలిగి ఉన్న పేరెంట్స్ వల్ల పిల్లలు తాము సాధించాలనుకుంది సాధించితీరుతారు.