అసాంఘిక కార్యక్రమాలకు ఓయో రూమ్ లు అడ్డగా మారిపోతున్నాయి. పోలీసులు ఎంత నిఘా పెట్టినా కూడా ఎక్కడో ఒకచోట గుట్టుచప్పుడు కాకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొందరు మద్యం సేవించేందుకు, జూదం ఆడేందుకు, వ్యభిచారం, మాదక ద్రవ్యాల వాడకం ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఓయో రూమ్ లు ఆవాసాలుగా మారిపోయాయి. పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు జరుపుతున్నా కూడా అలాంటి పనులకు బ్రేక్ పడటం లేదు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి హైదరాబాద్ లో వెలుగు చూసింది.
మాదాపూర్ పోలీసుల వివరాల ప్రకారం.. మాదాపూర్ జైహింద్ ఎన్ క్లేవ్ రహదారిలోని ఓయో క్వాలియాలో వ్యభిచారం సాగిస్తున్న వారిని అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు ఆదివారం రాత్రి దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఇద్దరు నిర్వాహకురాళ్లు, ఒక విటుడు, ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలను సహించేది లేదని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.