ఆ బాలికది తెలిసీ తెలియని తనం. వయసుతో పాటు శరీరంలో వచ్చే మార్పులను గ్రహించలేకపోయింది. దానిని ఆసరాగా చేసుకుని ఓ కామాంధుడు తన కోర్కెలు తీర్చేందుకు ఆమెను ఓ బొమ్మగా వాడుకున్నాడు. అతడు ఏం చేస్తున్నాడో కూడా తెలియని ఆ 13 ఏళ్ల బాలిక వాడు చెప్పినట్లు నడుచుకుంది. దాదాపు ఆరు నెలలుగా వాడు ఆమెను లైంగికంగా వాడుకుంటున్నాడని తల్లిదండ్రులు చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు. రెండ్రోజుల క్రితం బాలిక ఒంటిపై పంటి గాట్లు ఉండటంతో తల్లి నిలదీయగా మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
జహీరాబాద్ కు చెందిన మహ్మద్ మోహిజ్(20) హైదరాబాద్ లో తన సోదరి ఇంట్లో ఉంటూ వెల్డింగ్ పనులకు వెళ్తున్నాడు. అదే భవనంలో మరో కుటుంబం కూడా అద్దెకు ఉంటోంది. వారి మైనర్ కుమార్తెపై ఈ కామాంధుడి కన్ను పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మాయ మాటలు చెప్పి మేడ మీదకు తీసుకెళ్లి లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడు. ఇలా గత ఆరు నెలలుగా అవకాశం దొరికినప్పుడల్లా వాడి కోరిక తీర్చుకుంటున్నాడు. రెండ్రోజులు క్రితం బాలిక ఒంటిపై పంటి గాట్లు చూడటంతో అసలు విషయం తెలిసింది. బాలిక తల్లిదండ్రులు మోహిజ్ కు దేహశుద్ధి చేసి.. పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.