సెల్ ఫోన్ దొంగిలించాడనే అనుమానంతో ఓ వ్యక్తిని తల్లి కొడుకులు కలిసి దారుణంగా కొట్టడంతో మరణించాడు. దీంతో ఈ హత్య నుంచి తప్పించుకునేందుకు మృతదేహాన్ని దూరంగా నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. దీనిపై కూపీ లాగడంతో ఆ తల్లికొడకులు పట్టుబడ్డారు. ఈఘటన హైదరాబాద్ లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన దండసాయి రమేష్ (35) వృతిరీత్యా చెఫ్. హైదరాబాద్ కు వలస వచ్చిన అతను సూరారం కాలనీలో ఉంటూ గండిమైసమ్మలోని జెఎంజే టిఫిన్ సెంటర్‌లో చెఫ్ పనిచేస్తున్నాడు. అయితే.. డిసెంబరు 26న ఆ హోటల్ లో సెల్ ఫోన్, నగదు చోరీకి గురయ్యాయి. రమేష్ పై అనుమానంతో హోటల్ నిర్వాహకుడు రాకేశ్, అతని తల్లి భాగ్యలక్ష్మి అతన్ని చేతులు కట్టేసి కట్టెలతో కొట్టారు. దీంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హత్య నుంచి తప్పించుకునేందుకు రాకేష్ తన స్నేహితుల సహయంతో మృతదేహాన్ని బహదూర్ పల్లి సమీపంలో రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు.
రోడ్డు పక్కన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతుడి ప్యాంట్ జేబులో లభించిన వివరాలు, సీసీ కెమెరాల ఫుటేజీలను ఆధారంగా నిందితులను కనిపెట్టారు. హోటల్ నిర్వాహకుడు రాకేశ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా రాకేష్ అసలు నిజం చెప్పాడు. దీంతో మిగిలిన అతని స్నేహితులను అదుపులోకి తీసుకోగా అతని తల్లి పరారిలో ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.