ప్రతి ఒక్కరి దాంపత్య జీవితంలో చికాకులు, చిన్న చిన్న గొడవలు సహజమే. ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ సర్ధుకుపోతూ సంసార జీవితాని ముందుకు సాగించాలి. పూర్వం పెద్దలు సంసార జీవితాన్ని అలానే హాయిగా సాగించారు. కానీ నేటికాలంలో చాలా మంది దంపతులు ప్రతి విషయానికి పంతాలకు పోయి.. కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. కొందరు అయితే తన భాగస్వామిపై దాడులకు తెగపడేందుకు సైతం వెనుకాడటం లేదు. చివరికి ఈ ఘర్షణలో ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ జంట గొడవలతో కోర్టు మెట్లు ఎక్కింది. ఈ క్రమంలో భార్యపై పగ పెంచుకున్న భర్త.. కోర్టు పరిసర ప్రాంతంలోనే కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్నాటక రాష్ట్రం హాసన్ జిల్లా హాలెనరసీపూర్ తాలుకాలోని తట్టెకెరెకు చెందిన శివకుమార్ కు చిత్ర అనే యువతితో అయిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం హాయిగా సాగిన వారి సంసారంలో గొడవలు మొదలయ్యాయి. చిత్రతో శివకుమార్ తరచూ గొడవ పడేవాడు. ఆమెను రోజూ చిత్రహింసలకు గురి చేసేవాడు. అతడి వేధింపులు తట్టుకోలేక చిత్ర చివరి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఈక్రమంలో రెండేళ్ల క్రితం భర్త శివకుమార్ పై భరణం కేసు కూడా వేసింది. వారి కేసు విచారణ కోర్టులు కోనసాగుతుంది. ఈక్రమంలో శనివారం కేసు విచారణ నిమిత్తం చిత్ర, శివకుమార్ స్థానిక కోర్టుకు హాజరయ్యారు. నిందితుడు తన వెంట పదునైన కత్తిని తీసుకెళ్లాడు.
కోర్డు ప్రాంతంలోన వాష్ రూమ్ కి చిత్ర వెళ్లగానే వెంబడించి కత్తితో ఆమె మెడపై దాడి చేశాడు. కోర్టు పోలీసులు చిత్రాను వెంటనే తాలూకా ఆసుపత్రికి తరలించి, ఆ తర్వాత హాసన్‌లోని హెచ్‌ఐఎంఎస్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. శనివారం లోక్ అదాలత్ ద్వారా కేసును పరిష్కరించేందుకు ఇరువర్గాలను న్యాయమూర్తి కౌన్సెలింగ్‌కు పిలిపించారు. హత్య జరగడానికి ముందు కూడా న్యాయమూర్తి శివకుమార్, చిత్రలతో గంటసేపు సంభాషించారు. మరి… ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.