Khammam: ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. సర్పంచ్ దంపతులపై గుర్తు తెలియని కొందరు క్షుద్ర పూజలు చేశారు. గ్రామ శివారులోని శ్మశానంలో ఈ తతంగం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖమ్మంలోని కూసుమంచి మండలం భగవత్ వీడుతండ గ్రామానికి చెందిన సర్పంచ్ రవి దంపతులపై కొందరు క్షుద్రపూజలు చేశారు. శుక్రవారం రాత్రి శ్మశానంలోని షెడ్‌లో రవి దంపతుల ఫొటోతో పాటు పసుపు, కుంకుమ కలిపిన బియ్యం కనిపించాయి. వాటి పక్కనే ఓ కాగితం కూడా ఉంది. అది గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఏడాది కాలంగా ఇలాంటి పూజలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. పోలీసులకు ఇదివరకే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోయారు. దీనిపై ఎస్‌ఐ మాట్లాడుతూ.. ‘‘ మూఢ నమ్మకాలతో జీవితాలను పాడు చేసుకోవద్దు. దీనిపై వెంటనే దర్యాప్తు ప్రారంభిస్తాము. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటాము’’ అని హామీ ఇచ్చారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : Nellore: 40 నిమిషాల నరక వేదన.. కాపాడాలని వేడుకుంటూనే..