ఈ రోజుల్లో చాలా మందికి మొగుడు అల్లం.. ప్రియుడే బెల్లం అన్నట్లుగా ఉంది. పైపై ప్రేమలు, అవసరం కోసం వేసే బిస్కెట్లకే కొందరు ఆడవాళ్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకోసం ఏం చేయడానికైనా వెనకాడట్లేదు. అవసరమైతే కట్టుకున్న భర్తను కూడా సునాయాసంగా సమాధి చేసేస్తున్నారు. ఆ తర్వాత ఆ హత్యను కప్పిబుచ్చేందుకు నానా ఇక్కట్లు పడుతున్నారు. చివరికి పోలీసులు ఎంట్రీ ఇచ్చి వారి స్టైల్ లో నాలుగు తగిలించాక అసలు కథ కక్కేస్తున్నారు. క్షణిక సుఖం కోసం సంసారం, కుటుంబం, కన్న పిల్లలు అని కూడా లేకుండా బరితెగిస్తున్నారు. ఇప్పుడు చెప్పబోయేది ఆ కోవకు చెందిన మహిళ గురించే.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఈ దారుణం అనంతపురం జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా ఆలమూరు గ్రామానికి చెందిన చెయ్యేడు వీరేంద్రకు.. విజయలక్ష్మితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. ఎంతో ఆనందంగా సాగిపోతున్న సంసారం. ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో బంధువు వర్గం అంతా కూడా ఆ ఊరిలోనే ఉంది. అందరూ ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఆ సమంయలోనే విజయలక్ష్మి బుర్రలో అక్రమ సంబంధం అనే పురుగు దూరింది. దగ్గర బంధువైన చెయ్యేడు సందీప్ కు బాగా దగ్గరైంది. తరచూ ఫోన్లో మాట్లాడుకోవడం.. యోగక్షేమాలు, ముచ్చట్లుగా మొదలైన వారి పరిచయం.. చీకటి సంసారానికి తెరలేపే దాకా వెళ్లింది. భర్త ఇంట్లో లేనప్పుడు ప్రియుడ్ని కలవడం చేసేది. మొగుడు సంగతి ఏమో గానీ, ప్రియుడికి మాత్రం ఏ లోటూ రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకునేది. ముద్దు ముచ్చట్లు, సరసాల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈ తప్పుడు వ్యవహారం మొత్తం భర్తకు తెలిసిపోయింది. విషయం తెలిసి కుటుంబ పరువు ఏం కావాలంటూ భార్యను మందలించాడు. ఆ విషయాన్ని ప్రియుడికి చెప్పుకుని బాధపడిపోయింది. ఇలాగే వదిలేస్తే వారి బంధానికి అడ్డుగా మారతాడని భావించారు. ఎలాగైనా ఆ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అలా సడెన్ గా చంపేస్తే అనుమానం వస్తుందని పక్కా ప్లాన్ తో వీరేంద్రకు స్కెచ్ వేశారు. కుటుంబం మొత్తం కలిసి ఎగ్జిబిషన్ కు వెళ్లారు. ఆ రోజు అంతా ఎంతో ఆనందంగా గడిపారు. అలా ఉంటే ఆమె అనుమానం రాదని ఇలా ప్లాన్ చేశారు. బాగా ఎంజాయ్ చేసి ఇంటికొచ్చారు. బాగా అలిసిపోయిన వీరేంద్ర గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఆ తర్వాత ప్రియుడితో కలిసి దిండుతో గట్టిగా అతని ముఖంపై ఒత్తి హత్య చేశారు.
ఇదీ చదవండి: పార్లర్ పనికని.. వ్యభిచారంలోకి..
తెల్లవారిన తర్వాత ఏం తెలియనట్లు పోలీసులకు సమాచారం ఇచ్చింది. నా భర్త పాముకాటుతో మరణించాడని నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసులకు మృతదేహాన్ని చూస్తే పాముకాటు మృతిలా అనిపించలేదు. అనుమానంతో పోస్టుమార్టం చేయించారు. రిపోర్టు వచ్చాక అనుమానం మరింత బలపడింది. భార్య తీరుపై అనుమానం వచ్చి విచారణ చేయగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ప్రియుడితో కలిసి తాను చేసిన మొత్తం వ్యవహారాన్ని పోలీసుల ముందు ఒప్పుకుంది. విజయలక్ష్మి, సందీప్ లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.