ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలను నివారించటానికి అనేక చర్యలు తీసుకుంటారు. కానీ కొంత మంది ట్రాఫిక్ పోలీసులు మాత్రం చలాన్ల పేరుతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝులిపించండం సమాజానికి మంచిదే. కానీ కొందరు పోలీసులు అన్ని నిబంధనలు పాటించిన వారిపై కూడా ఇష్టం వచ్చినట్లు చలాన్లు విధిస్తున్నారు. చాలా సందర్భాల్లో వాహనదారు ట్రాఫిక్ పోలీసుల అసహానం వ్యక్తం చేస్తుంటారు.
ట్రాఫిక్ పోలీసులు చేసే కొన్ని పనులుకు వాహనదారులు అవకాశం వస్తే ఎదురు తిరగటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. పోలీసులు చూపే అత్యుత్సాహానికి సంబంధించిన ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తి చలాన్లు పేరుతో వేధింపులకు గురి చేయడం విసుగు చెందిన ఆ వ్యక్తి ఏకంగా తన బైక్ నిప్పంటించాడు.
వివరాల్లోకి వెళ్తే….. ఆదిలాబాద్ లో ట్రాఫిక్ పోలీసుల చలాన్ల బాధలు భరించలేక ఖానాపూర్ కు చెందిన మక్బూల్ అనే తన మోటార్ సైకిల్కు నిప్పు పెట్టాడు. ట్రాపిక్ పోలీసుల వేధింపులు తట్టుకోలేక పట్టణంలోని పంజాబ్ చౌరస్తాలో తన బైక్కు నిప్పు పెట్టడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. గతంలో తన ద్విచక్రవాహనానికి చలాన్లు పడ్డాయని, వాటిని కట్టిన కూడా తరుచూ కట్టాలని ట్రాఫిక్ పోలీసులు అడుగుతున్నారని మక్బాల్ తెలిపారు. ఈ ట్రాఫిక్ పోలీసులు వేధింపులు, చలానాల బాధలు తట్టుకోలేకే తన బైక్కు నిప్పు పెట్టినట్లు మక్బూల్ అవేదన వ్యక్తం చేశారు.