ట్రాఫిక్ పోలీసులకు వాహనం నుంచి తాళం తీసుకునే అధికారం ఉందా? మోటార్ వెహికల్ చట్టం ఏం చెబుతోంది? ఒకవేళ పోలీసులు మీ వాహనం కీ తీసుకుంటే ఏం చేయాలి?
బైక్ మీదో, కారు మీదో వాహనం ఏదైనా గానీ రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించవలసిందే. కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకున్నా.. బైక్ మీదనో స్కూటీ మీదనో వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోకున్నా ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు. వెహికల్ మీద ఏదైనా చలానా ఉండి.. కట్టకపోయినా.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా కొంతమంది ట్రాఫిక్ పోలీసులు వాహనం యొక్క తాళం తీసేస్తుంటారు. ఐదేంటని అడిగితే.. నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ కొంచెం ర్యాష్ గా ప్రవర్తిస్తారు. బండి తాళం తీసుకుపోతే ర్యాపిడో, ఓలా, ఉబర్ లాంటి సర్వీసులు లేని ఏరియాలో.. జేబులో డబ్బులు లేకపోతే ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? నడుచుకుంటూ వెళ్లడమేనా? ఇలాంటి దారుణాలు తెలియకుండా చాలానే జరుగుతున్నాయి.
అసలు వాహనదారుడి వాహనం తాళాలు తీసుకునే అధికారం ట్రాఫిక్ పోలీసులకు ఉందా? అంటే లేదు అని చట్టం చెబుతోంది. చాలా మందికి ఈ చట్టం గురించి తెలియదు. అడ్డుకుంటే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవ్వదు. ఇండియన్ మోటార్ వెహికల్ చట్టం 1932 ప్రకారం.. ట్రాఫిక్ పోలీసుకి బలవంతంగా కారు లేదా బైక్ తాళం తీసుకునే అధికారం లేదు. ఒకవేళ అలా చేస్తే అది చట్ట విరుద్ధం అవుతుంది. ఏ పోలీస్ అధికారికి కూడా ఈ అధికారం లేదు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే ఈ చట్టం గురించి చెప్పవచ్చు. అలానే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి ట్రాఫిక్ పోలీసు మాత్రమే నిబంధనలు ఉల్లంఘించినప్పుడు జరిమానా విధించగలరు. ఏఎస్ఐలు, ఎస్సైలు, ఇన్స్పెక్టర్లు మాత్రమే స్పాట్ లో జరిమానా విధించే అధికారం కలిగి ఉంటారు.
ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వీరి సహాయం కోసం మాత్రమే ఉన్నారు. వారికి మీ వాహనం కీ తీసుకునే అధికారం లేదు. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం ట్రాఫిక్ పోలీసులకు తాళం తీసుకోవాలన్న నిబంధన లేదని.. డ్రైవింగ్ లైసెన్స్ అడిగితే డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ చూపించాలని.. లైసెన్స్ లేకపోతే జరిమానా విధించే హక్కు పై స్థాయి అధికారులకే ఉంటుందని లాయర్ గుల్షన్ బగోరియా వెల్లడించారు. మోటార్ వెహికల్ చట్టం 130 ప్రకారం.. వాహనదారుడిని డాక్యుమెంట్స్ అడిగితే చూపించాలి. డ్రైవింగ్ లైసెన్స్ వంటివి తమకు ఇవ్వాలని అడిగితే ఇవ్వడం, ఇవ్వకపోవడం పూర్తిగా వాహనదారుడి ఇష్టమే. కొన్ని సందర్భాల్లో పోలీసు అధికారి వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్ ని జప్తు చేయవచ్చు. ఆ సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ ని తీసుకుంటారు. అప్పుడు లైసెన్స్ స్వాధీనం చేసుకుంటారు. బదులుగా ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ చెల్లుబాటు అయ్యే రశీదు ఇచ్చిందని నిర్ధారించుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. గమనించగలరు.