వాళ్లిద్దరు ఇష్టపడ్డారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత కొంత కాలం పాటు ప్రేమించుకున్నారు. ఇక ఇలాగే కలకలం పాటు కలిసి బతకాలని నిశ్చయించుకున్నారు. దీంతో ప్రేమ పెళ్లి చేసుకుంటామని పెద్దలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వీరి పెళ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయినా సరే వారిని ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పెళ్లై నెల రోజులు కూడా తిరగకముందే కూతురిపై కక్ష పెంచుకున్న తండ్రి అల్లుడిని, కూతురిని దారుణంగా హత్య చేసి పగ తీర్చుకున్నాడు. తాజాగా తమిళనాడులో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలోని తూత్తూకూడి జిల్లా వీరపట్టి పరిధిలోని జేవియర్ నగర్. ఇదే ప్రాంతానికి చెందిన రేష్మ(20), మాణిక్కరాజు (28) అనే వీరిద్దరూ ఒకే ఊరు కావడంతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త చివరికి ప్రేమగా మారింది. దీంతో ఒకరినొకరు ఇష్టపడడంతో గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇక కలకాలం ఇలాగే ఉండాలనుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇదే విషయాన్ని అమ్మాయి తల్లిదండ్రులకు వివరించారు. కానీ ఒకే సామాజిక వర్గానికి చెందినా కూడా రేష్మ తండ్రి అంగీకరించలేదు. దీంతో కూతురు తీవ్ర మనస్థాపానికి గురైంది.
తల్లిదండ్రులు కాదన్న సరే రేష్మ ఎలాగైన ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇక అనుకున్నట్లుగానే వీరిద్దరు కలిసి ఇంటి నుంచి పారిపోయి తిరుమంగళంలో జూన్ 28న పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం పాటు ఎక్కడో తలదాచుకుని వారం రోజుల తర్వాత తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రేష్మ తండ్రి పగతో రగిలిపోయాడు. ఎలాగైన కూతురితో పాటు ఆమె ప్రియుడిని కూడా హత్య చేయాలని అనుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నారు.
అలా కాపుకాసి ఇటీవల వీరిద్దరూ ఇంట్లో ఉండగా రేష్మ తండ్రి కూతురుని గొంతు కోసి అల్లుడిని నరికి చంపాడు. ఈ దాడిలో నవ దంపతులు రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దీనిపై స్పందించిన మాణిక్కరాజు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: పెళ్లి రోజని భర్తతో పాటు సరదాగ బీచ్ కు వెళ్లింది.. కానీ అక్కడ భార్య సీన్ చూసి భర్త షాక్!