వారికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇక భార్యకు అమెరికాలో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లింది. ఇండియాలో ఒంటరిగా ఉంటున్న భర్త మరదలిపై మనసు పడ్డాడు. ఎలాగైన మరదలిని లొంగదీసుకుని కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగానే సరికొత్త ఉపాయంతో ముందుకెళ్లి బొక్కబోర్లపడ్డాడు. బావ తీరుపై విసుగుచెందిన మరదలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల తమిళనాడులో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు తిరుపూరు జిల్లా వాణియంబాడిల పరిధిలోని వూంగలం. ఇదే ప్రాంతానికి చెందిన రాజేష్ అనే యువకుడు తన్మోళి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక పెళ్లైన కొంత కాలానికే భార్యాభర్తల మధ్య కలహాలు మొదలయ్యాయి. దీంతో కోపంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక కొంత కాలానికి భార్యకు అమెరికాలో ఉద్యోగం రావడంతో ఆమె అక్కడికి వెళ్లింది. అప్పటి నుంచి భర్త రాజీపడి భార్యతో ఫోన్ లో మాట్లాడుతుండేవాడు. ఇక ఈ క్రమంలోనే రాజేష్ ఒంటరిగా ఉంటూ ఉండేవాడు. దీంతో అప్పుడప్పుడు అత్తింటి వెళ్తున్న సమయంలోనే అందంగా ఉన్న తన మరదలిపై మనసుపడ్డాడు.
ఎలాగైన మరదలిని లొంగదీసుకోవాలనే భావించి ఆ దిశగా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే ఇటీవల మరదలికి మత్తు మందు ఇచ్చి తన వైపు తిప్పుకోవాలని అనుకుని అదే పని చేశాడు. రాజేష్ బలవంతంగా ఆ మత్తు మందును మరదలి నోట్లో పోయడంతో కొద్ది సేపటి తర్వాత ఆ యువతి అస్వస్థతకు గురైంది. ఒక్కసారిగా ఆ యువతి అరుపులు, కేకలు వేయడంతో హుటాహుటిన స్థానికులు అంతా అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక అనంతరం మరదలు బావా తీరుపై విసుగుచెంది పోలీసులు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.