మన భారతీయ సంస్కృతిలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇలా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న వివాహ వ్యవస్థకు కొందరు వ్యక్తులు మచ్చ తెస్తున్నారు. సంసారపు కట్టుబాట్లను గాలికొదిలేసి తాము కోరుకున్న సుఖం కోసం అన్నీ మరిచి అడుగులు వేస్తున్నారు. కొందరు మహిళలు ప్రియుడితో తెగ ఎంజాయ్ చేస్తూ నిండు కాపురాలను చేజేతులా కూల్చేసుకుంటున్నారు. ఇలా వివాహేతర సంబంధాల కారణంగా కొందరు మహిళలు భర్తను కాదని పరాయి మగాడి మైకంలో పడి చివరికి కట్టుకున్న భర్తను అవమాన పాలు చేస్తున్నారు. ఇలాగే ప్రవర్తించిన ఓ భార్య వ్యవహారాన్ని తట్టుకోలేని భర్త భార్యను దారుణంగా హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది కర్ణాటకలోని కొలూరు జిల్లా కేజీఎఫ్. ఇదే ప్రాంతానికి చెందిన రాము అనే వ్యక్తి తమిళనాడులోని పేరుమూహాల్ లోని ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగానికి కుదిరాడు. ఇక్కడ పని చేస్తున్న క్రమంలోనే రామును సరిత అనే అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలా పెళ్లైన కొన్నేళ్ల పాటు భార్యాభర్తలు సంతోషంగానే గడిపారు. కొంత కాలానికి ఓ కుమారుడు పుట్టి చనిపోయాడు. అయితే ఇద్దరు ఒకే కంపెనీలో పని చేస్తుండడంతో సరిత మరో అబ్బాయితో పరిచయం పెంచుకుంది. ఈ పరిచయమే చివరికి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో అప్పటి నుంచి భార్య సరిత ఫోన్ లో తెగ బిజీగా మారిపోయి సంసారాన్ని మరిచిపోయింది. సంసారపు కట్టుబాట్లను గాలికోదిలేసి ప్రియుడితో తెగ ఎంజాయ్ చేస్తుంది.
ఈ క్రమంలోనే భర్తకు భార్యపై అనుమానం కలిగింది. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు కూడా జరిగాయి. ఇక చివరికి ఆ అనుమానం నిజమేనని భావించిన రాము తట్టుకోలేకపోయ్యాడు. అతని కోపం కట్టలు తెంచుకుంది. ఏం చేయాలో అర్థం కాదు, ఎవరికి చెప్పాలో తెలియదు. ఇలా తనలో తాను కుమిలిపోతూ భార్యను లేకుండా చేయాలనే ఆలోచన కలిగింది. ఇక అనుకున్నదే ఆలస్యం.. భర్త రాము భార్యతో గొడవ పడి సరితను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె శవాన్ని ఇంటి ఎదురుగా ఉన్న ఓ నీటి కుంటలో పడేసి నా భార్య కనిపించకుండా పోయిందని ఏం ఎరగనట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇక పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా భర్త రాము పోలీసుల వెంట భార్య కోసం గాలింపు చర్యల్లో పాల్గొన్నాడు. అయితే ఈ క్రమంలోనే వీరుంటున్న ఇంటి సమీపంలోని నీటి కుంట నుంచి దుర్వాసన వస్తుంది. స్థానికులు అంతా గమినించేలోపే ఆ నీటి కుంటలోంచి ఓ మనిషి శవం బయటపడంది. దీనిపై స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా ఆ శవం ఎవరిదో కాదు, రాము భార్య సరితదేనని స్థానికులు గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు రామును విచారించగా ఎట్టకేలకు తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.