మరో న్యూడ్ ఫోటోల వ్యవహారం కలకలం రేపింది. మహబూబ్ నగర్ జిల్లాలో మహిళలకు మాయ మాటలు చెప్పిన కేటుగాళ్లు.. ధన, కనక వర్షం కురవాలంటే తాంత్రిక పూజలు చేయాలని అన్నారు. జాతకాలు, పుట్టుమచ్చలు, శరీరాకృతి పేరిట అమాయక మహిళలకు వల విసిరారు.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో న్యూడ్ ఫోటోలు ఘటన వెలుగులోకి వచ్చింది. జాతకాలు, పుట్టుమచ్చల, శరీరాకృతి పేరిట అమాయ మహిళలకు వల వేశారు కేటుగాళ్లు. ధన, కనక వర్షం కురవాలంటే తాంత్రిక పూజలు చేయాలని నమ్మబలికారు. దీని కోసం న్యూడ్ ఫోటోలను పంపాలని పేర్కొన్నారు. నిజమేనని నమ్మిన అమాయక మహిళలు.. న్యూడ్ ఫోటోలను, వీడియోలను ఆ ముఠాకు పంపారు. వాటిని హైదరాబాద్ లోని ఓ తాండ్రికుడికి పంపందీ ముఠా. తిరిగి వాటిల్ని వినియోగించి.. మహిళల్ని వేధించడం మొదలు పెట్టారు. డబ్బులు ఇవ్వాలని లేదంటే ఈ ఫోటోలను నెట్ లో విడుదల చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
మీరు కుద్ర పూజలు చేయిస్తే నోట్ల వర్షం కురుస్తుందని నమ్మబలికి మహిళల నుండి న్యూడ్ ఫోటోలు సేకరించారు. ఈ ముఠాకు బలైన వారిలో ఉమ్మడి మహబూబా నగర్ జిల్లా వ్యాప్తంగా బాధితులున్నారు. మహిళలే కాదు పురుషులు సైతం వీరి మోసాలకు బలయ్యారు. ఈ విషయంపై గొడవ జరగ్గా.. పోలీసులకు సమాచారం వెళ్లింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ముగ్గుర్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో ఇద్దరు తాంత్రికుల హస్తం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ముఠాలో జడ్చర్లలో ఇద్దరితో పాటు ఆమంఘల్‌కు చెందిన మరో వ్యక్తి క్రియాశీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.