కష్టపడి పని చేయాలంటే బద్దక.. కానీ జీవితం మాత్రం లగ్జరీగా గడిచిపోవాలి. చేతి నిండా డబ్బులుండాలి.. విచ్చలవిడిగా ఖర్చు చేయాలి. జాబ్ చేస్తే.. నెలంతా కష్టపడి పని చేస్తే.. నెలాఖరులో జీతం చేతిలోకి వస్తుంది.. ఏదైనా బిజినెస్ చేస్తే.. సక్సెస్ అయితే ఓకే.. లేదంటే.. మరింత నష్ట పోవాలి. మరి జీవితంలో ఏంజాయ్ చేయాలంటే ఏం చేయాలి.. దానికి అడ్డదారులు తొక్కడమే బెటర్ అనుకుంటున్నారు చాలా మంది. జల్సాలకు అలవాటుపడి.. నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఈమధ్య కాలంలో పెరుగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. పండుగ సందర్భంగా జనాలు ఊరికెళ్తే.. దొంగలు తమ పని చక్కబెట్టారు.
ఇక నేటి కాలంలో దొంగతనాలు చూస్తే.. పోలీసులే షాక్ అవుతున్నారు. దొంగల తెలివితేటలు చూసి అవాక్కవతున్నారు. ఎలాంటి క్లూస్ వదలకుండా.. ఎంతో జాగ్రత్తగా పని ముగించుకుని వెళ్తున్నారు. ఒక కొందరేమో.. ఎలాగూ దొంగతనం చేయాలని భావించాం.. అదేదే.. పెద్ద పెద్ద వారి ఇళ్లల్లో దొంగతనం చేస్తే బెటర్ కదా అనుకుంటున్నారు. అందుకే ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల ఇళ్లకు కన్నం వేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. జీవితంలో సెటిల్ అవ్వాలంటే.. కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి.. అందుకే ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం చేస్తే సరి.. ఇక లైఫ్ సెటిల్ అవుతుంది అని భావించిన దొంగలు. ఎమ్మెల్యే ఇంటిని టార్గెట్ చేశారు. ఆ వివరాలు..
కృష్ణా జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఇంటికి కన్నం వేశారు దొంగలు. ఆయన స్వస్థలం బాపులపాడు మండలం, శేరీనరసన్నపాలెం ముందడుగు కాలనీలో ఉన్న ఎమ్మెల్యే ఇంట్లో బంగారు నగలు దోచుకెళ్లారు. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు..సుమారు 3 లక్షల విలువైన బంగారు నగలు దోచుకెళ్లారు. అయితే దొంగతనం జరిగిన ఇంట్లో ఎమ్మెల్యే ఉండటం లేదు. ఆయన తల్లిదండ్రులు ఉంటున్నారు.
అయితే ఎమ్మెల్యే తల్లిదండ్రులు.. నెల కిత్రం శేరీనరసన్నపాలెంలో ఉన్న ఇంటికి తాళం వేసి పామర్రులోని ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం దొంగతనం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ఇంట్లో పని చేసే మనిషి.. దొంగతనం జరిగినట్లు గుర్తించి.. అనిల్ కుమార్ కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి ఎమ్మెల్యే ఇంటికి కన్నం వేసిన ఈ దొంగల మాస్టర్ ప్లాన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.