పుట్టిన దగ్గర నుండి పిల్లల భవిష్యత్తు కోసం కలలుకంటారు. ఆ కలలను నిజం చేసేందుకు వారి ఆశలను కూడా వదిలిపెడతారు. మంచి బడులు, కాలేజీల్లో చదివించేందుకు వెనుకాడరు. కానీ వారి కలలను చిదిమేస్తున్నాయి అనుకోని ప్రమాదాలు.
పిల్లలపై గంపెడు ఆశలు పెట్టుకుని బతుకుతుంటారు తల్లిదండ్రులు. పుట్టిన దగ్గర నుండి పిల్లల భవిష్యత్తు కోసం కలలుకంటారు. ఆ కలలను నిజం చేసేందుకు వారి ఆశలను కూడా వదిలిపెడతారు. మంచి బడులు, కాలేజీల్లో చదివించేందుకు వెనుకాడరు. పిల్లలకు మంచి విద్యా బుద్దులు నేర్పించేందుకు.. దూర, భారమైనా పిల్లలను చేరుస్తారు. కానీ విధికి ఎవ్వరైనా తలవంచాల్సిందే. తల్లిదండ్రుల కలలను కల్లలు చేస్తూ.. వారి ఆశలను చిదిమేస్తున్నాయి ఊహించని ప్రమాదాలు. చివరకు కళ్ల ముందే బిడ్డలు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతే గర్భశోకంతో విలవిలలాడుతున్నారు. ఎంతో భవితవ్యాన్ని చూడాల్సిన ఓ చిన్నారి కారు చక్రాల కింద నలిగిపోయింది.
తిరుపతి జిల్లాలోని నారాయణ వనం మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9వ తరగతి చదువుతున్న సోనియా అనే విద్యార్థిని మృత్యువాత పడింది. సైకిల్‌పై వెళుతున్న విద్యార్థిని కారు ఢీకొట్టడంతో విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగింది. సోనియా ప్రతి రోజు ట్యూషన్‌కు వెళుతుంది. పుత్తూరు, చెన్నై జాతీయ రహదారిలోని నారాయణవనం మండల కేంద్రం నుంచి భీముని చెరువుకు వెళ్లే రహదారిపై ట్యూషన్‌కి వెళ్లి ఇంటికి తిరిగి పయనమైంది. సొంతూరు బ్రాహ్మణ తాగేల్‌కి సైకిల్‌పై వెళుతూ రోడ్డు దాటుతుండగా, కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. విద్యార్థిని స్థానిక ఉన్నత పాఠశాలలో చదువుతోంది. బాలిక చనిపోయిందన్న వార్త తెలిసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ విషయం పోలీసులకు చేరింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.