రంగారెడ్డి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. అంత్యక్రియలకు డబ్బులు లేవని ఓ శిశువు మృతదేహాన్ని తల్లిదండ్రులు చెరువులో పడేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది రంగారెడ్డ జిల్లాలోని మొయినాబాద్ పరిధిలోని కొడంగల్ ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన శివ, అనూష ఇద్దరు భార్యాభర్తలు.
వీరికి గతంలోనే వివాహం జరగగా మే 14న ఈ దంపతులకు నెలలు నిండని ఓ మగ బిడ్డ జన్మించింది. నెలలకు నిండకపోవడంతో ఆ శిశువు ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదు. దీంతో కొన్ని రోజులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స కూడా అందించారు. అయినా కూడా ఆ శిశువు ఆరోగ్యం సహకరించకపోవడంతో గత రెండు మూడు రోజుల చికిత్స పోందుతూ మరణించింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.
ఇక చేసేదేం లేక అంత్యక్రియలు చేద్దామని అనుకుంటుండగా తల్లిదండ్రుల చేతిలో చిల్ల గవ్వలేదు. ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. ఇక గుట్టుచప్పుడు కాకుండా ఆ శిశువు మృతదేహాన్ని స్థానికంగా ఉండే ఓ చెరువులో పడేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అంత్యక్రియలకు డబ్బులు లేని కారణంగానే ఆ శిశువు మృతదేహాన్ని చెరువులో పడేసినట్లు పోలీసులు సైతం తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.