Private Bus: ఈ మధ్య కాలంలో ప్రైవేట్ బస్సులు ఎక్కువగా ప్రమాదానికి గురవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు కానీ, 20 మంది దాకా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన జరిగి నెలకూడా గడవకముందే నెల్లూరు జిల్లాలో మరో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. మంగళవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బళ్లారి నుంచి నెల్లూరు వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు కండ్రిక వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సు లోపల 26 మంది ప్రయాణికులు ఉన్నారు.
వీరిలో 10మందికి తీవ్ర గాయాలవ్వగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు బోల్తా పడటాన్ని గమనించిన స్థానికులు సహాయం చేయటానికి పూనుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు కూడా సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : బ్లేడుతో భర్త పీక కోసిన కొత్త పెళ్లికూతురు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.