ఈ మద్య చాలా చిత్ర విచిత్రమైన దొంగతనాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపిలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంటికి వెళ్లడానికి ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ చేశాడు. వివరాల్లోకి వెళితే..
విజయనగరం జిల్లాలో పాలకొండు పాలకొండకు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు సోమవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో అందరూ వెతకడం ఆరంభించారు. కొంత మంది విద్యార్థులను సోమవారం రాత్రి రాజాం నుంచి వంగర లో డ్రాప్ చేసిన డ్రైవర్ పి.బుజ్జి వంగర పోలీస్ స్టేషన్ ఎదురుగా బస్సు ని పార్క్ చేసి వెళ్ళాడు. ఉదయం వచ్చాక బస్సు కనిపించలేదు. ఒక్కసారీ షాక్ తిన్న డ్రైవర్ వెంటనే వంగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బస్సు కనిపించడం లేదనన్న విషయం తెలుసుకున్న ఆర్టీసీ డిపో మేనేజర్, సీఐ తన సిబ్బందితో వంగర పోలీస్ స్టేషన్‌కు మంగళవారం వెళ్లారు. బస్సు ఆముదాలవలస మండలం మీసాల డోలపేటలో ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లారు. వేలిముద్రలను సేకరించి బస్సును వంగర ఠాణాకు తీసుకువచ్చారు. చౌదరి సురేష్ అనే వ్యక్తి తాగిన మైకంలో బస్సును తీసుకు వెళ్లినట్లు తెలుసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కె.రవికుమార్ తెలిపారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.