నేటి కాలంలో కొందరు దుర్మార్గులు చిన్నారుల నుంచి పండు మసలవ్వల వరకు ఎవరినీ కూడా వదలడంలేదు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు తమ వక్రబుద్దిని చూపిస్తూ దారుణాలకు తెగబడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వివాహితపై భర్త స్నేహితుడు కన్నేసి భర్తను గుప్పిట్లోకి తెచ్చుకుని అతని భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. ఇది భరించలేని ఆ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అది నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం. ఇదే ప్రాంతానికి చెందిన ఓ దంపతులు స్థానికంగా ఓ గ్రామంలో నివాసముంటున్నారు. అయితే పూర్తిగా తాగుడుకు బానిసైన భర్త కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఇదే అదునుగా భావించిన అతని స్నేహితుడు అతని భార్యపై కన్నేశాడు. దీంతో భర్తకు తాగినంత మందు పోయిస్తూ అతనిని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. అతడి ద్వారానే భార్యకు మత్తుమంది ఇప్పించాడు.
ఇది కూడా చదవండి: Medchal District: ముగ్గురూ స్నేహితులు.. దీంతో వారిని నమ్మి ఆ యువతి బైక్ ఎక్కింది!
అలా కొన్నాళ్లపాటు ఆ దుర్మార్గుడు దారుణంగా వ్యవహరించి అతని భార్యపై అనేకసార్లు దారుణానికి ఒడిగట్టాడు. ఇక ఇంతటితో ఆగకుండా వీడియోలు, ఫోటోలు తీస్తూ బెదిరింపులకు దిగాడు. వీడియోలు అందరికీ పంపుతానని భయపెట్టి ఆమెపై అనేకసార్లు ఆ పని చేశాడు. దీంతో ఈ విషయం భార్య కొన్నాళ్లకి భర్తకి తెలిపింది. పక్కనున్న స్నేహితుడే ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని తట్టుకోలేకపోయాడు. ఏం చేయాలో తెలియక ఇటీవల ఆ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు.
దీంతో గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఈ దంపతులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.