ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వాళ్లు హఠాత్తుగా కన్నుమూయడంతో బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
గుండెపోటు.. ఇప్పుడు ఈ పదం వినిపిస్తే చాలు ప్రజల వెన్నుల్లో వణుకు పుడుతుంది. ఈ మద్య ఎక్కడ చూసినా గుండెపోటుతో మరణించారు.. అన్న వార్తలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వరుసగా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వాళ్లు హఠాత్తుగా కన్నుమూయడంతో బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మొన్నటి వరకు కరోనా భయపెడితే.. ఇప్పుడు గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. స్నేహితులతో సినిమాకు వెళ్లి సంతోషంగా గడిపిన యువకుడు హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూశాడు. ఈ విషాద ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఖమ్మం జిల్లా నక్కలగరుబు గ్రామానికి చెందిన మురళీ కృష్ణ అనే యువకుడు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాడు. మురళీ కృష్ణ తల్లిదండ్రులు కొట్టే పెద్దకృష్ణ, రాధ ఎంత పేదరికంలో ఉన్నప్పటికీ కొడుకును కష్టపడి చదివించారు. తమ కొడుకు గొప్ప చదువు చదివి ఉన్నత ఉద్యోగం చేసి కుటుంబాన్ని ఆదుకుంటారని ఎన్నో కలలు కన్నారు. వారి కలలు నిజం చేస్తూ హైదరాబాద్ లో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ సాఫ్ట్ వేర్ రంగానికి సంబంధించి ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు మురళీ కృష్ణ. ఇటీవలే హైదరాబాద్ లో మంచి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాడు.
తమ కొడుకు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదించాడన్న సంతోషం తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు. ఇక తమ కష్టాలు దూరమైనట్టే అని ఆనందంలో ఉన్నారు.. కానీ ఆ సంతోషం కొంతకాలమైన ఉండకుండా పోయింది. గురువారం సాయంత్రం మురళీ కృష్ణ తన స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లాడు. అంతలోనే మాయదారి గుండెపోటు వచ్చి వచ్చి సీట్ లోనే కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు దగ్గరలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మురళీ కృష్ణ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. తమ కుమారుడి మరణ వార్త విన్న తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి.. వారి బాధ చూసిన ప్రతి గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు. కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్న కొడుకు అర్థాంతరంగా కన్నుముయడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.