ఈ మధ్యకాలంలో లోన్ యాప్ వేధింపులను భరించలేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషమం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఫైనాన్స్ సంస్థ వేధింపులను భరించలేని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా చోటు చేసుకున్నఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లాలోని బొల్లారం తాండాకు చెందిన సునీత అనే మహిళ గతంలో ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి లోన్ తీసుకుంది. కొన్ని నెలల పాటు డబ్బులు చెల్లిస్తూ వచ్చింది.
కానీ గత కొన్ని రోజుల నుంచి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సునీత కట్టలేకపోయింది. దీంతో అప్పటి నుంచి డబ్బులు కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ అధికారులు ఆమెపై వేధింపులకు గురి చేశారు. డబ్బులు కట్టాల్సిందే అంటూ పదే పదే అడగడంతో వారి వేధింపులను తట్టుకోలేకపోయింది. తీవ్ర మనస్థాపానికి గురైన సునీత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫైనాన్స్ సంస్థ వేధింపులను భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళ నిర్ణయంపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.