భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం. రాత్రి తిట్టుకుని, తెల్లారి మాట్లాడుకునే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఇలా కాకుండా కొందరు భార్యాభర్తలు రగిలిన గొడవకు మరింత ఆజ్యం పోస్తూ సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. ఇలా బరితెగించిన ఓ భార్య భర్తను చావాలని కోరడంతో భరించలేని భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల హన్మకొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది. అసలేం జరిగిందంటే? అది హన్మకొండ జిల్లా శాయంపేట మండలం రాజుపల్లి. ఇదే గ్రామానికి చెందిన కొండా రాకేష్(28) అనే యువకుడు హైదరాబాద్ లోని హెచ్ సీఎల్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతనికి ఫిబ్రవరి నెలలో వరంగల్ జిల్లాకు చెందిన దేవులపల్లి హారిక(24) అనే యువతితో వివాహం జరిగింది. భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగి కావడంతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వీరి కాపురం సజావుగా సాగింది. అయితే గతంలో కరోనా నేపథ్యంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అంతా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. రాకేష్ సైతం ఇంటి నుంచే ఉద్యోగం చేస్తున్నాడు. కానీ హారికకు మాత్రం ఊర్లో ఉండడం కన్నా హైదరాబాద్ లో ఉండడమే ఇష్టం. దీంతో భర్తకు పలుమార్లు ఊరిలో కాకుండా హైదరాబాద్ లోనే ఉందామని చెప్పి చూసింది. ఆఫీసుకు రమ్మంటేనే వెళ్దామని భర్త రాకేష్ చెప్పాడు. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. 5 నెలల గర్భవతి అయిన హారిక భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక కొన్ని రోజుల గడిచాక కూడా భార్యను మరోసారి హైదరాబాద్ వెళ్దామని అడిగింది. భర్త రాకేష్ కాదనడంతో తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే భర్తకు వీడియో కాల్ చేసిన భార్య.. నువ్వు చచ్చిపో.. నేనే మరో పెళ్లి చేసుకుంటానని తెలిపింది. భార్య అంత మాట అనడంతో రాకేష్ తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. దీంతో పాటు అత్తమామల పోరుకు తోడవ్వడంతో మరింత కృంగిపోయాడు. ఏం చేయాలో అర్థంకాని రాకేష్ ఇటీవల సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రాకేష్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేష్ భార్య, అత్తమామలపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజయండి. ఇది కూడా చదవండి: ప్రియుడిని కిడ్నాప్ చేసిన ప్రియురాలు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!