చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు.. అప్పటి వరకు మన కళ్ల ముందు ఉన్నవారు అకస్మాత్తుగా మృత్యు వడిలోకి చేరుకుంటారు. ఇద్దరు అన్నదమ్ములు పదేళ్లు కూడా నిండకుండానే లోకాన్ని విడిచిపోయారు. వారిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు కొడుకులు. ఒకేసారి రెండు కుటుంబాల్లో వారసులను కోల్పొవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన మెదక్ లో జరిగింది.
మెదక్ జిల్లా కొల్చారం కి చెందిన షేకులు, లాలయ్య అన్నదమ్ములు. వీరిద్దరి సంతానం లో షేకులు కొడుకు అజయ్, లాలయ్య కొడుకు నర్సింహులు 2013 మే 22 జన్మించారు. అజయ్, నర్సింహ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉండేవారు.. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లేవారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకే స్కూళ్లో చదువుతున్నారు. మధ్యాహ్నం బోజనం చేసిన తర్వాత స్కూల్ కి సమీపంలో ఉన్న నీళ్ల కుంట వద్దకు వెళ్లారు. నీటి కుంటకు కాళ్లకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన ఇద్దరూ అన్నదమ్ములు రాకపోవడంతో తోటి విద్యార్థులు అక్కడికి వెళ్లి చూశారు. నీటి కుంటలో ఇద్దరు అన్నదమ్ములు మునిగిపోవడం గమనించి వెంటనే ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.
విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయుడు మరికొంత మందితో ఘటనా స్థలానికి కొన ఊపిరితో ఉన్న అజయ్ ని మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగానే మార్గమద్యలో చనిపోయాడు. ఇక గ్రామస్థుల సహకారంతో పోలీసులు ఆ నీటి కుంటలో ఉన్న నర్సింహ మృతదేహాన్ని బయటకు తీశారు. ఒకే రోజు జన్మించి ఒకేరోజు మరణించిన అన్నదమ్ములను చూసి తల్లిదండ్రులు విల విలలాడిపోయారు. వారి కన్నీరు చూసి గ్రామస్థులు చలించిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.