ఈమె పేరు లక్ష్మి, చాలా ఏళ్ల కిందటే పెళ్లై ఓ కుమారుడు కూడా జన్మించాడు. అతనికి పెళ్లి వయసు రావడంతో తల్లి పెళ్లి చేయాలని అనుకుంది. కానీ, కుమారుడికి సంబంధాలు వచ్చినట్టే వచ్చి అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.
ఒక్కగానొక్క కొడుకు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైన కుమారుడిని కొంత వరకు చదివించారు. ఇక కొడుకుకి పెళ్లి వయసు రావడంతో తల్లిదండ్రులు పెళ్లి చేయాలని అనుకున్నారు. ఇందుకోసం మొన్నటి చాలా సంబంధాలు చూశారు. కానీ, ఒక్కరు కూడా ఆమె కుమారుడిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు. దీంతో ఆ తల్లి తీవ్ర మనస్థాపానికి గురై బలనవ్మరణానికి పాల్పడ్డారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా నిజాంపేటలో గుడ్ల శంకరయ్య-లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రంజిత్ (25) అనే ఒక్కగానొక్క కుమారుడు సంతానం. కుమారుడు ఒక్కడే కావడంతో తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెంచి కష్టపడి చదివించారు. ఇక కొడుకుకి పెళ్లి వయసు రావడంతో తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో అప్పటి నుంచి రంజిత్ కు చాలా పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. కానీ, ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. దీంతో రంజిత్ తల్లి లక్ష్మి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఆమెకు ఏం చేయాలో అర్థం కాక చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. అయితే, సోమవారం రాత్రి ఇంట్లో భర్త, కుమారుడు నిద్రపోయారు. మధ్య రాత్రి లక్ష్మి నిద్రలేచి ఊళ్లోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఉదయం నిద్రలేచి చూసే సరికి లక్ష్మి కనిపించలేదు. ఆమె కుటుంబ సభ్యులు కంగారు పడి గ్రామంలో అంతా గాలించారు. ఈ క్రమంలోనే లక్ష్మి ఊరులోని చెరువులో శవమై తేలింది. ఈ విషయం తెలుసుకుని లక్ష్మి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతురాలి భర్త శంకరయ్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటనతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుమారుడికి పెళ్లి కావడం లేదని ఆత్మహత్య చేసుకున్న తల్లి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.