ఈ మద్య కొంతమంది డబ్బు కోసం దేనికైనా సిద్దపడుతున్నారు. ఎదుటివారిని ఈజీగా మోసం చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. ముఖ్యంగా కొంతమంది కేటుగాళ్లు ఫోర్జరీ సంతకాలు చేస్తూ దారుణంగా మోసాలకు పాల్పపడుతున్నారు.
ఇటీవల కొంతమంది ఈజీ మనీకోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. ముఖ్యంగా ఫోర్జరీ సంతకాలతో ఎదుటి వారిని దారుణంగా మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. వ్యక్తుల సంతకాలు ఫోర్జరీలు చేసి ఆస్తులు కొట్టేయడం, హాల్ టికెట్ పై ఫొటో ఫోర్జరీ చేసి ఎగ్జామ్స్ రాయడం నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఇలాంటి దుశ్చర్యలు మాత్రం ఆగడంలేదు. అలాంటి సంఘటనే మెదక్ జిల్లాలో ఒకరి లైసెన్సుతో మరొకరు డ్రైవింగ్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే..
మెదక్ జిల్లా ఆర్టీసీ డిపోలో ఓ వ్యక్తి వేరొక వ్యక్తి డ్రైవింగ్ లైసెన్సుతో బస్సు నడిపిస్తున్నాడు. ఇది రెండు నెలల నుండి జరుగుతున్నా.. బయటపడలేదు. అసలు లైసెన్సుదారుడు తన పేరుతో వేరే వ్యక్తి విధులు నిర్వహిస్తున్న విషయం గమనించి ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు బండారం బయటపడింది. ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిల్ కుమార్ గౌడ్ నర్సాపూర్ మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆర్టీసీ అద్దె బస్సు నడిపే అవకాశం కల్పించమని చండూర్ కు చెందిన విష్ణును అడిగాడు. అనిల్ తన డ్రైవింగ్ లైసెన్సు కాపీని విష్ణుకు వాట్సప్ చేశాడు.
విష్ణు అనిల్ డ్రైవింగ్ లైసెన్సును డౌన్ లోడ్ చేసుకుని తన బావమరిది కృష్ణ ఫొటో అటాచ్ చేసి, దానికి హెల్త్ కార్డ్ జత చేశాడు. దీంతో తన బావమరిది అయిన కృష్ణకు డ్రైవింగ్ అవకాశం లభించింది. రెండు నెలల తర్వాత ఈ విషయం తెలుసుకున్న అసలు లైసెన్సుదారుడైన అనిల్ ఆర్టీసీ అధికారులకు నిందితునిపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడు ఫోర్జరీ చేసిన నేరంపై ఆర్టీసీ డిపో ఇన్ ఛార్జి లక్ష్మణ్ ఆర్టీసీ విజిలెన్స్ అధికారలకు ఫిర్యాదు చేశారు. తదుపరి చర్యలు అధికారులు తీసుకుకోనున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.