శంకర్ పల్లి మండలం అలంఖాన్ గూడ గేటు సమీపంలో వ్యక్తి కళ్లల్లో కారం చల్లి దుండగులు దారుణంగా కత్తులతో నరికి హత్య చేశారు. మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషులు ఇక ఇప్పుడు అదే మానవత్వం లేకుండా దారుణం గా హత్యలు చేస్తున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. సభ్య సమాజం లో మనుషుల మధ్య బ్రతకడానికి కూడా సాటి మనిషి భయపడే పరిస్థితి ఏర్పడింది. మనుషుల్లో మానవత్వం కరువై పోతున్న నేపథ్యం లో ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి ఆపద ముంచు కొస్తుందో కూడా ఊహకందని విధంగా ఉంటుంది.
చిన్నచిన్న కారణాలకే ఏకంగా ఉన్మాదులు గా మారి పోయి హత్యలకు పాల్పడుతు చివరికి కటకటాలపాలవుతున్నారు ఎంతో మంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే అలంకాన్ గూడ గేట్ వద్ద జరిగిన దారుణహత్య స్థానికులు అందరిని కూడా భయబ్రాంతులకు గురి చేసింది. ఈ ఘటన జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ దొరికిన ఆధారాలను బట్టి మృతుడు మహాలింగాపురానికి చెందిన వెంకటయ్య (40)గా గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. అసలు హత్య జరగడానికి కారణాలేంటి? ఎవరు చంపారు? ఈ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.
ఎన్నో దారుణమైన హత్యలు వెలుగు లోకి వస్తు సభ్య సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఒకప్పుడు మృగాలను చూస్తే మనుషులు భయ పడే వారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా మనుషులను చూస్తే మృగాలే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎందు కంటే మృగాల కంటే దారుణం గా అంతకు మించిన మృగాలు గా మారి పోతున్నారు మనుషులు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.