ప్రేమ విషయంలో అబ్బాయి అయినా, అమ్మాయి అయినా నిజాయితీగా ఉండాలి. ఏదో టైం పాస్ కోసం ప్రేమించినట్టు నటించడం, సందు చూసుకుని వాడేసుకోవడం, ఆ తర్వాత వదిలేయడం లాంటివి చేయకూడదు. ఇక అమ్మాయిలైనా గిఫ్ట్ ల కోసం, లిఫ్ట్ ల కోసం.. అందాక తాత్కాలిక బాయ్ ఫ్రెండ్ అంటూ అవసరాలకు మగాడ్ని వాడుకుని వదిలేయడం వంటి పనులు చేయకూడదు. వాడుకోవడానికి అయితే మార్కెట్ లో పనికిమాలిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నిజాయితీగా ప్రేమించే వారు చాలా తక్కువగా ఉంటారు. పద్ధతిగా ప్రేమించి, పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే అమ్మాయిల జీవితంలోకి అబ్బాయిలు వెళ్తారు. కానీ అలాంటి నిజాయితీ ఉన్న అబ్బాయిల జీవితాలతో ఈ అమ్మాయిలు ఆడుకుంటారు.
ఎక్కువగా ప్రేమిస్తే అనుమానిస్తున్నావని అంటారు. తమతోనూ, ఇతర అబ్బాయిలతోనూ ఒకేలా ఉంటే.. ప్రియుడికి, వాడికి తేడా ఏముంటుంది చెప్పండి. కానీ అందరూ ఒకటే అని అందరితోనూ క్లోజ్ గా ఉంటారు. అదే కొంతమంది అబ్బాయిలకి నచ్చదు. నిజాయితీగా ప్రేమించే అబ్బాయిలు కొంతమంది అమ్మాయిలకి నచ్చరు. ప్రేమ పేరుతో తుప్పల్లోకో, పొదల్లోకో తీసుకెళ్లే సన్నాసులు ఉన్న ఈరోజుల్లో.. నిజాయితీగా ప్రేమించే మగాళ్లు కూడా ఉన్నారు. కానీ అలాంటి మగాళ్ల జీవితాలతో ఈ ఆడవాళ్లు ఆడుకుంటున్నారు. అందుకే అలాంటి అమ్మాయిల విషయంలో అబ్బాయిలు కఠినంగా ఉంటున్నారు. సరిగ్గా ఇలాంటిదే మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రేవా నగరంలో మౌగంజ్ ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. తన గర్ల్ ఫ్రెండ్.. వేరే వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతుందన్న అనుమానం వచ్చి యువకుడు ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో యువకుడు.. గర్ల్ ఫ్రెండ్ పై పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చాడు. ఆమె పెద్ద అనుమానంగా గాడిలా ఉన్నావ్, నేను చేసుకోను ఛీ పో.. అని చీదరించుకుంది. దీంతో యువకుడికి కోపమొచ్చింది. కిందేసి తొక్కుతూ.. కొడుతూ.. అమ్మాయి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. దీన్ని ఫ్రెండ్ వీడియో తీశాడు.
ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ అయ్యింది. అమ్మాయి.. తనపై దాడి చేసిన యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు యువకుడి కోసం గాలిస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ ఘటనలో తప్పు ఎవరిది? అబ్బాయితో ప్రేమలో ఉంటూ.. వేరే వ్యక్తితో గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుతున్న అమ్మాయిదా? లేక అమ్మాయిని అర్థం చేసుకోకుండా ఆమెపై ఇష్టం వచ్చినట్టు దాడి చేసిన అబ్బాయిదా? లేక ప్రేమ విలువ తెలియని ఇద్దరిదీనా? తప్పెవరిదో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలానే ప్రస్తుత ప్రేమపై మీకున్న అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.