దేశం టెక్నాలజీ రంగంలో ఎంతో ముందుకు సాగుతుంది. అంతరిక్షాన్ని జయించిన మనిషి మూఢ నమ్మకాలను మాత్రం ఇప్పటికీ గుడ్డిగానే నమ్ముతున్నారు. దేశంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందుతున్నా.. ఇప్పటికీ పలు గ్రామాలు, పట్టణాల్లో క్షుద్రపూజలు, మంత్రాలు ఉన్నాయని నమ్ముతూనే ఉన్నారు. డబ్బుపై అత్యాశతో ఓ భర్త తన భార్య పట్ల దారుణంగా ప్రవర్తించాడు. అందరి ముందు నగ్నంగా స్నానం చేయాలని బలవంతం చేశాడు. ఇక తప్పని పరిస్థితిలో భర్త మాట వినాల్సి వచ్చింది ఆ భార్య. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో పుణెలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర పుణెలో ఓ వ్యక్తి డబ్బు కోసం క్షుద్రపూజలు చేశాడు. గత కొంత కాలంగా తాను వ్యాపారంలో బాగా నష్టపోయానని ఓ వ్యక్తిని సంప్రదించాడు. వ్యాపారంలో లాభాలు రావాలన్నా.. మగ సంతానం కలగాలన్నా.. క్షుద్ర పూజ చేయాలని ఆ వ్యక్తి చెప్పడంతో ఆ భర్త ఘరోమైన పనికి పూనుకున్నాడు. తన భార్యను అందరి ముందు నగ్నంగా స్నానం చేయాలని బలవంతం చేశాడు. ఈ దారుణానికి అతని తల్లిదండ్రులు కూడా సహకరించడంతో చేసేదేమీ లేక నిస్సహాయురాలైన భార్య.. చెప్పినట్టు ఆ పని చేసింది.
ఈ దారుణాన్ని చుట్టు పక్కల వారు చూడటం తప్ప ఏమీ చేయలేకపోయారు. తర్వాత బాధితురాలు తీవ్ర అవమానంగా భావించింది. తనను బలవంతంగా ఈ పనికి ఒప్పించారని పోలీసులను ఆశ్రయించింది. భర్తతో తల్లిదండ్రులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ దారుణానికి అసలు కారకుడైన మాంత్రికుడు మాత్రం ఇప్పటి వరకు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.