ప్రతి మనిషి జీవితంలో సమస్యలు అనేవి ఉంటాయి. కష్టాలు లేని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరు. అయితే తోటి వారి నుంచి కూడా అనేక వేధింపులు, సమస్యలు ఎదురవుతుంటాయి. అవి లైంగికంగా కావొచ్చు లేదా మరే రకమైనా వేధింపులు కావొచ్చు. అయితే వీటిని కొందరు ధైర్యంగా పోరాడి సమస్యను అధికమిస్తారు. మరికొందరు మాత్రం భయపడి.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలానే తాజాగా ప్రిన్సిపాల్ వేధింపులను భరించలేక ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు లోని వేలురూ జిల్లా గుడియాత్తం తాలుకా కామాక్షి అమ్మన్ గార్డెన్ చెందిన నాగేశ్వరి(56) గుడియాత్తంలోని ఓ ప్రభుత్వం పాఠశాలలో టైలరింగ్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈమెకు విఘ్నేష్ అనే కుమారుడు ఉన్నాడు. అతడు ఇంజినీరింగ్ పూర్తి చేసి.. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే శుక్రవారం నాగేశ్వరి.. తన ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు గుడియాత్తం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.. తన తల్లిని టైలరింగ్ శిక్షణకు అనుమతి ఇవ్వకుండా చాలా వేధించే వాడని, రోజూ గ్రంథాలయ భవనంలో విధులు నిర్వహించాలని చెప్పేవాడని ఫిర్యాదు లో పేర్కొన్నాడు. ఇక గ్రంథాలయంలోనే పనిచేయాలని చెప్పడంతో పాటు తరచూ అసభ్య పదజాలంతో తన తల్లిని దూషించే వాడని మృతురాలి కుమారుడు తెలిపాడు. ఇటీవల తన తల్లి ఆనారోగ్యం కారణంగా 12 రోజుల పాటు మెడికల్ సెలవు పెట్టిందని ఫిర్యాదులో వెల్లడించారు. అయితే రెండు రోజుల క్రితం మెడికల్ సర్టిఫికెట్ తో స్కూల్ కి వెళ్లగా.. అక్కడ గంటపాటు దూషించి వేధింపులకు గురి చేశాడని, సర్టిఫికెట్ తీసుకునేందుకు కూడా నిరాకరించాడని తెలిపాడు. ఆ మనోవేదనతో తన తల్లి నాగేశ్వరి ఇంట్లో ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: ప్రియుడిని దక్కించుకునేందుకు కిలాడీ లేడీ ఖతర్నాక్ ప్లాన్! నోరెళ్లబెట్టిన పోలీసులు! ఇదీ చదవండి: అతనంటే ఆమెకు నమ్మకం.. వారంతంలో సరదాగా లాంగ్ డ్రైవ్ కు వెళ్లి!