కొత్తగా పెళ్లైన కాస్త ఉన్నత ఫ్యామిలీలు అయిన దంపతులు ఎంచక్కా హనీమూన్ ప్లాన్ చేసుకుంటుంటారు. జీవితంలో కొత్త భార్యాభర్తలకు మరిచిపోని మాధురానిభూతి ఇదే అని చెప్పక తప్పదేమో. అలా కొత్తగా పెళ్లైన ఓ జంట హనీమూన్ కు వెళ్లారు. కానీ ఆ రోజు రాత్రి భర్త దారుణానికి తెగబడుతూ ఊహించని నీచానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా మధ్యప్రదేశ్ లో వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్ లోని నాగరిక కాలనీకి చెందిన ఓ యువతి కాన్ఫూరుకు చెందిన యువకుడితో నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. వారిద్దరివి ఉన్నత కుటుంబాలు కావడంతో పెళ్లి సమయంలో అతడికి 40 తులాల బంగారం, ఓ లగ్జరీ కారును వరకట్నం కింద ఇచ్చారు. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లైన కొన్ని రోజులకే హనీమూన్ కు వెళ్లారు. అక్కడికి వెళ్లాక భర్త రాత్రి భార్యతో అసహజ శృంగారం చేస్తూ వీడియోలు కూడా తీశాడు.
ఇది కూడా చదవండి: Guntur Crime News: కోరుకున్న ఉద్యోగంలో చేరే ఒక్కరోజు ముందు యువతి ఆత్మహత్య
అలా పెళ్లైన నాటి నుంచి చాలా రోజుల వరకు భార్యతో అనేక సార్లు శృంగారం పాల్గొన్నప్పుడు వీడియోలు తీయడం మొదలుపెట్టాడు. భార్య స్నానం చేసినా, బట్టలు మార్చుకున్నా ప్రతిదీ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ కు దిగాడు. నాకు రూ.కోటి రూపాయలు ఇవ్వాలని, నీ వీడియోలు సోషల్ మీడియాలో బయటపెడతానని బెదిరించాడు. భార్య ఇదే విషయాన్ని అత్తామామలకు కూడా చెప్పడంతో వాళ్లు కూడా భర్తకే సపోర్ట్ చేశారు. దీంతో ఆ యువతని అప్పటి నుంచి అదనపు కట్నం తేవాలంటూ తీవ్ర వేధింపులకు గురి చేసేవాడు.
ఇక ఏం చేయాలో అర్థం కానీ ఆయువతి ఇటీవల స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను విచారించగా షాక్ కు గురిచేసే వీడియోలను బయటపెట్టాడు. ఈ వీడియోలను చూసిన పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. భర్త, అత్తామామలతో పాటు మరో ఒకరిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి,