ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో న్యూడ్ వాట్సాప్ కాల్స్ కలకలం రేపుతున్నాయి. కొందరు అమ్మాయిలు యువకులకి వీడియో కాల్స్, మెసేజ్‌లు చేస్తూ బ్లాక్‌మెయిలింగ్‌లకి పాల్పడుతున్నారు. పొరపాటున వీడియో కాల్ లిఫ్ట్ చేస్తే.. సదరు యువతులు నగ్నంగా దర్శనమిస్తారు. కట్ చేస్తే వీడియో కాల్ రికార్డ్ అవుతుంది. అమ్మాయితో పాటు కాల్ లిఫ్ట్ చేసిన వ్యక్తి కూడా ఆ నగ్న వీడియోలో రికార్డ్ అవుతాడు. స్క్రీన్ రికార్డింగ్ యాప్ ద్వారా వీడియో రికార్డ్ చేసి బాధితుడ్ని బెదిరించి డబ్బులు గుంజుతారు. ఇలా ఇప్పటివరకూ అనేక మంది మగాళ్ళు వేలకి వేలు డబ్బులు కోల్పోయారు. తాజాగా ఇలాంటి అనుభవమే తనకు ఎదురైందని ఆదిలాబాద్ లాయర్ మీడియా ముందు వెల్లడించారు.
కొత్త నంబర్ నుండి తనకి హాయ్ అని మెసేజ్ వచ్చిందని, ఎవరని అడగగా ఆమె ఏదో పేరు చెప్పిందని అన్నారు. అయితే ఫేక్ అయి ఉంటుందని లైట్ తీసుకున్నానని, కానీ ఆ యువతి మాత్రం కంటిన్యూస్‌గా వాట్సాప్ వీడియో కాల్స్ చేయడం మొదలుపెట్టిందని అన్నారు. ఎంత ఇగ్నోర్ చేసినా అదే పనిగా ఫోన్లు వస్తుండడంతో విసిగిపోయి.. వీడియో కాల్ ఆన్సర్ చేశానని అన్నారు. ఆన్సర్ చేయగానే సదరు మహిళ వెంటనే బట్టలు విప్పేసిందని, భయపడి తాను కాల్ కట్ చేశానని అన్నారు. అయితే ఆ యువతి తనకు బెదిరింపు మెసేజ్‌లు చేసిందని, డబ్బులివ్వకపోతే నగ్నంగా మాట్లాడిన వీడియోని యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించిందని అన్నారు.
దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితుడికి వచ్చిన ఫోన్ నంబర్‌ని తీసుకుని వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. అయితే అపరిచితులు చేసే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని నంబర్ నుండి కాల్స్ వచ్చినా, వాట్సాప్ మెసేజ్‌లు వచ్చినా రెస్పాండ్ అవ్వద్దని లాయర్ అంటున్నారు. మరి అమ్మాయిలని అడ్డు పెట్టుకుని బ్లాక్‌మెయిలింగ్‌లకు పాల్పడుతున్న మోసగాళ్ళపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.