వివాహేతర సంబంధాలు కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. ఈ మోజులో తమ భాగస్వామిని, పిల్లల్ని సైతం పట్టించుకోవడం మానేస్తున్నారు. వద్దని వారిస్తున్న వారిని, అడ్డు తొలగించుకునేందుకు అఘాయిత్యాలకు కూడా వెనుకాడటం లేదు. అక్రమ సంబంధం వద్దని వారించిన భర్తకు .. భార్య ప్రియుడు అత్యంత దారుణమైన శిక్ష విధించిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది.
అక్రమ సంబంధాల కల్చర్ నానాటికి పెరిగిపోతుంది. పరాయి వ్యక్తుల వ్యామోహంలో కాపురాలు కూలిపోతున్నాయి. భార్య, భర్త ఇద్దరూ కూడా వివాహేతర సంబంధాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ మోజులో తమ భాగస్వామిని, పిల్లల్ని సైతం పట్టించుకోవడం మానేస్తున్నారు. వద్దని వారిస్తున్న వారిని, అడ్డు తొలగించుకునేందుకు అఘాయిత్యాలకు కూడా వెనుకాడటం లేదు. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు అనేకం చూస్తున్నాం. వివాహేతర సంబంధాల్లో విచక్షణ కోల్పోతున్నారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని నిలదీసినందుకు.. అతడిపైనే కక్ష పెంచుకున్నాడో ఫైనాన్షియర్. అతడ్ని తీవ్రంగా హింసించాడు. ఈ ఘటన తిరుపతిలోని చంద్రగిరిలో చోటు చేసుకుంది.
రంగం పేటకు చెందిన వంశీ అనే ఆటో డ్రైవర్.. అన్వర్ అనే ఫైనాన్షియర్ దగ్గర.. ఆటో తీసుకుని నడిపేవాడు. ఈ లావాదేవీల నేపథ్యంలో వంశీ భార్యకు అన్వర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త వంశీకి తెలియగా.. భార్యను తిట్టి బెంగళూరుకు ఉపాధి నిమిత్తం వెళ్లిపోయాడు. పలుమార్లు భార్యకు హెచ్చరించినా అన్వర్‌తో అక్రమ సంబంధం కొనసాగిస్తుండటంతో వంశీ బాధపడ్డాడు. సోషల్ మీడియా వేదికగా అన్వర్‌ను తిడుతూ, అతడికి వ్యతిరేకంగా ఆర్ఐపి అంటూ పోస్టులు పెట్టాడు. ఇది చూసిన అన్వర్ తిరిగి వంశీపై కక్ష పెట్టుకున్నాడు. తన స్నేహితుడి హర్ష సహకారంతో వంశీని బెంగళూరు నుండి కిడ్నాప్ చేయించి చంద్రగిరికి తీసుకువచ్చాడు అన్వర్.
వంశీని తీవ్రంగా గట్టిగా కొట్టి, అతని తలపై మూత్రం పోసి, గుండు కొట్టించాడు. కనీసం పది రోజులుగా అతడిని హింసించాడు. అన్వర్ తనకు క్షమాపణలు చెప్పించుకుని, దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అయితే దీనిపై ఎటువంటి పోలీసు కేసు నమోదు కాలేదు. ఓ పోలీస్ కానిస్టేబుల్ అండ దండలతోనే అన్వర్, హర్షలు రెచ్చిపోయారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిందితులు అన్వర్, హర్షలను అరెస్టు చేసినట్లు సమాచారం. భార్య అక్రమ సంబంధాన్ని నిలదీసినందుకు భర్తకే ఎదురైన ఈ చేదు అనుభవంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.