”సినిమాల ప్రభావం జనాలపై ఎలా ఉందో తెలీదుకానీ.. పంచ్ డైలాగ్ ల ప్రభావం మాత్రం గట్టిగానే ఉంది” దూకుడు సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు చెప్పిన డైలాగ్. కానీ నేటి సమాజంలో జరుగుతున్న క్రైమ్స్ అన్ని ఈ డైలాగ్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. పంచ్ డైలాగ్స్ కంటే సినిమా స్టోరీనే జనాలపై తీవ్ర ప్రభావాలు చూపుతున్నాయి. అవి ఎంతలా అంటే.. అందులో క్రైమ్స్ ఎలా చేస్తారో చూసి.. అచ్చం అలాగే ఫాలో అవుతున్నారు కొందరు. తాజాగా ఓ టీవీ షో స్ఫూర్తితో తనను తానే చంపేసుకుంది ఓ యువతి. కానీ ఆమె బతికేఉంది. థ్రిల్లర్ మూవీని మించిన ఈ కథను చేధించిన పోలీసులకు అసలు నిజాలు తెలుసుకుని కంగుతిన్నారు. దృశ్యం సినిమాను మించిన ఈ స్టోరి గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రేటర్ నోయిడాకు 15 కిలోమిటర్ల దూరంలో ఉన్న బధ్పురా గ్రామానికి చెందిన యువతి పాయల్. ఈమె తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలోనే పాయల్.. అజయ్ అనే యువకుడిని ప్రేమించింది. కానీ ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి భయపడింది. ఇంతలోనే ఆ కుటుంబాన్ని ఓ విషాదం కమ్ముకుంది. బిజినెస్ లో వచ్చిన నష్టాలను పూడ్చలేక పాయల్ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో పాయల్ మానసికంగా కుంగిపోయింది. అజయ్ ఆదరణ పాయల్ కు లభించినప్పటికీ డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. పైగా అప్పులు ఇచ్చిన డబ్బులు అడుగుతుండటంతో ఏమి చేయాలో వారికి తోచలేదు.
ఈ క్రమంలోనే ఇన్ని బాధలు భరించలేక పాయల్ ఇంట్లోనే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. దాంతో ఆమె మృతదేహానికి బంధువులు అంత్యక్రియలు చేశారు. పోలీసులు సైతం సూసైడ్ కేసుగా నమోదు చేసుకుని కేస్ క్లోజ్ చేశారు. కట్ చేస్తే.. కథకు అసలు టర్నింగ్ పాయింట్ ఇక్కడే మెుదలైంది. అదే ఏరియాలో ఓ యువతి మిస్సింగ్ కేసు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దర్యాప్తు లోతుకు పోయే కొద్ది ఒక్కొక్క విషయం బయటికి వస్తూఉంది. పాయల్ ప్రియుడు అజయ్ కు ఈ మిస్ అయిన అమ్మాయికి పరిచయం ఉన్నట్లు పోలీసులు కునగొన్నారు. దాంతో అజయ్ ను పట్టుకుని విచారిస్తే.. అసలు నిజం భయటపడింది. పాయల్ కోసంమే నేను ఇదంతా చేశానని.. పాయల్ బతికే ఉందని బాంబులాంటి నిజాన్ని ఒప్పుకున్నాడు.
అవును పాయల్ బతికే ఉంది. వాళ్ల నాన్నచేసిన అప్పుల నుంచి తప్పించుకోవడానికే ఇదంతా చేశామని పాయల్, అజయ్ లు అంగీకరించారు. ఇందుకోసం పాయల్ ఫిజిక్ తో సరిగ్గా ఉన్న అమ్మాయి కోసం వెతకసాగారు వారిద్దరు. వారికి షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న ఓ యువతి పరిచయం అయ్యింది. దాంతో సదరు యువతిని నమ్మించి తన రూమ్ కు తీసుకొచ్చాడు. అక్కడే ఉన్న పాయల్ ఆమె గొంతు కోసి, ముఖం ఎవరూ గుర్తు పట్టకుండా ఫేస్ పై వేడి నూనే, యాసిడ్ పోసి కాల్చేశారు. ఈ తతంగాన్ని పూర్తి చేసి.. అనుకున్న ప్రకారం ఉడాయించారు. బాధితురాలు మిస్సింగ్ అన్న ఫిర్యాదుతో ఈ థ్రిల్లర్ స్టోరి భయటపడింది. అయితే పోలీసుల ఇంటరాగేషన్ లో సంచలన విషయాలను వెల్లడించారు ఈ జంట. తాను చూసిన ఓ టీవీ షో స్ఫూర్తితోనే నేను ఇలా చేశానని పాయల్ తెలిపింది. పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి, వారి నుంచి ఓ రివాల్వర్ ను సైతం రికవరీ చేసుకున్నారు.