పెళ్ళైన విషయాన్ని దాచిపెట్టి మాయమాటలతో మరో మహిళను పెళ్లిచేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. కొన్నాళ్ల దాంపత్య జీవితం తరువాత ఆ భర్త ముఖం చాటేయడంతో బాధిత మహిళ కుమారుడితో కలిసి దీక్షకు దిగింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపహాడ్ మండలంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సారపాకకు చెందిన సులోచన, మారేడుపల్లికి చెందిన సువర్ణరాజు భార్యాభర్తలు. సువర్ణరాజు ప్రస్తుతం సారపాకలోని క్రీస్తు సంఘం చర్చిలో ఫాదర్ గా పని చేస్తున్నాడు. కాగా ఇతనికి ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని దాచి సులోచనను 2008 లో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి ఒక కుమారుడు.
ఇది కూడా చదవండి : మిస్టరీగా మారిన గుంటూరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తనూజ మరణం
వీరి దాంపత్య జీవితం 12 ఏళ్ళు సజావుగా సాగినప్పటికీ, గత ఏడాది కాలంగా చిన్న చిన్న గొడవలు జరగడంతో విడిగా ఉండేదుకు నిర్ణయించుకున్నారు. సంరక్షణకు మనోవర్తి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం మనోవర్తి ఇవ్వకుండా తిరుగుతున్నాడని స్థానికంగా తన కుమారుడితో కలిసి దీక్షకు దిగింది బాధిత మహిళ. తమకు న్యాయం జరిగేవరకు దీక్షను విరమించేది లేదని బాధితురాలు స్పష్టం చేసింది.